‘ఓ బేబీ’ మూవీ రివ్యూ

‘ఓ బేబీ’ మూవీ రివ్యూ

నటీనటులు : సమంత,నాగ శౌర్య,లక్ష్మి,రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్,తేజ సజ్జా : దర్శకత్వం : బి వి నందిని రెడ్డి * నిర్మాత‌లు : సురేష్ బాబు,సునీతా తాటి,టి జి విశ్వ ప్రసాద్, థామస్ కిన్. * సంగీతం : మిక్కీ జె మేయర్ * సినిమాటోగ్రఫర్ : రిచర్డ్ ప్రసాద్ * ఎడిటర్ : జునైద్ సిద్ధికి

సమంత ప్రధాన పాత్రలో రూపొందించిన మూవీ ‘ఓ బేబి’. రిలీజ్ కి ముందే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న బేబి ఎలా ఉందో చూద్దాం.

కథ:

సావిత్రి(లక్ష్మీ) ఒక క్యాంటిన్ ని తన చిన్ననాటి స్నేహితుడు (చంటి) తో కలసి రన్ చేస్తుంటుంది. పెళ్ళయిన ఏడాదికే భర్తను పోగొట్టుకున్న సావిత్రి తన కొడుకే లోకంగా బ్రతుకుతుంది. తన ప్రేమను డామినేషన్ గా అనుకున్న కొడలు కారణంగా ఆమె ఇంటి నుండి బయటకు వచ్చేస్తుంది. కానీ సావిత్రి కోల్పోయిన టైం తిరిగి వస్తుంది. ఆమె 22 యేళ్ళ అమ్మాయిగా మారుతుంది. తన అనుకున్నవి అన్నీ చేయడానికి టైం దొరుకుతుంది. మరి బేబి ఏం చేసింది..? ఏం సాధించింది అనేది మిగిలిన కథ..?

కథనం:

చాలా కాలం తర్వాత లక్ష్మి నటన మరోసారి పతాక స్థాయిలో కనిపించిన మూవీ ‘ఓ బేబి’. ఆమె సహాజంగా కనిపించే మోతాదు మించిన యాక్టింగ్ ని నందిని రెడ్డి బాగా కొలతల్లో పెట్టింది. బామ్మగా, ఆత్మాభిమానం నిండిన వ్యక్తిగా మొదటి అరగంట లక్ష్మి నటన ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఆ పాత్ర తో ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోతే అదే లక్షణాలతో కనిపించే సమంత కనెక్ట్ అవదు. సమంత హిట్ సినిమాలో తనో భాగం అవడం కాదు.. సినిమా భారాన్ని తనమీద మోసే స్థాయికి సమంత లోని నటన చేరింది. ఈయేడాది వరుస విజయాలతో సమంత సూపర్ పాస్ట్ గా ఉంది. ఆ స్పీడ్ ని మరింత పెంచింది బేబి. ప్రతి జీవితంలోనూ అన్ని సమపాళ్ళలో ఉండవు.. వాటని భరిస్తూ తన వాళ్ళకోసం బ్రతికే జీవితాలు చాలా ఉంటాయి. వాటి వెనకాల చాలా త్యాగాలుంటాయి. వాటి వెల దేవుడు కూడా కట్టలేడు. కానీ ఆ కష్టాలకు కరిగో.. జరిగిపోయిన కాలం తిరిగి వస్తే ఏం చేస్తుందో చూద్దామనో ఒక పెద్ద మ్యాజిక్ తన జీవితాన్ని 22 యేళ్ళ దగ్గరకు తీసుకువస్తుంది. ఆ తర్వాత బేబి జీవితంలో జరిగేవన్నీ కొత్తగా ఉంటాయి. గయ్యాళి తనం వెనుక ప్రేమ ఉంటుంది. డామినేషన్ వెనక కేరింగ్ ఉంటుంది. వాటిని అర్దం చేసుకొని జీవితాలకు బేబి మెత్తగా వాతలు పెడుతుంది. రాజేంద్ర ప్రసాద్ మరోసారి విజృంభించాడు. తనదైన నటనతో మళ్లీ నవ్వించాడు. ఏడిపించాడు. పాత్రకు ప్రాణం పోసాడు. బేబి గా సమంత ఈ పాత్రకు ప్రాణం పోసింది. 70 యేళ్ళ అనుభవాన్ని 20 యేళ్ళ వయస్సులో చూపించడంలో సక్సెస్ అయ్యింది. తనను ప్రేమించే వారికి దగ్గరవడం కంటే తను ప్రేమించిన కుటుంబం కోసమే తన అడుగులు వేసింది. ఏ వయస్సులో ఉన్నా, అమ్మ అమ్మే కదా..? మనవడి తో అల్లరిని పంచుకుంటూనే, చంటితో తన అనుబంధాన్ని కొనసాగిస్తుంటుంది. నాగశౌర్య తన పాత్రకు న్యాయం చేసాడు. రావు రమేష్ తన కెరియర్ లో మరో ఉదాత్త మైన పాత్రతో మెప్పించాడు. తన కోపాన్ని బాధ ను బయటకు చెప్పకోలేని సగటు తండ్రి పాత్రలో జీవించాడు. చెప్పకనే చాలా చెప్పాడు. బాల నటుడిగా మెప్పించిన శ్రీతేజ్ ఈ పాత్రతో మరోసారి ఆకట్టుకున్నాడు. రావు రమేష్ తో అతని కాంబినేషన్ సీన్ చాలా బాగుంది. ఇంట్లో వాళ్ల ప్రేమను చాదస్తం అనుకునే కుర్రాళ్ళకు ఆ సీన్ వాళ్ళ ప్రేమను చూపెడుతుంది. కథలో కనిపించే ప్రతి పాత్రకు ఒక మంచి ముగింపు నిచ్చింది నందిని రెడ్డి. కామెడీ కోసం ప్రత్యేకంగా కథను ఎక్కడికీ తీసుకెళ్ళలేదు. సమంత తన కెరియర్ ని చక్కని పాత్రలతో మరింత ఉన్నతంగా మలుచుకుంటుంది. హీరో సెంట్రిక్ ఇండస్ట్రీలో హీరో ఇమేజ్ ని సొంతం చేసుకుంది.

చివరిగా:

అందరికీ నచ్చే బేబి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫస్ట్ చాయిస్ అవుతుంది. సమంత కెరియర్ లో మరో హిట్ గా మిగులుతుంది.

Tags

Read MoreRead Less
Next Story