పన్ను చెల్లింపు దారులకు వరాలు ప్రకటించిన ఆర్థిక మంత్రి

పన్ను చెల్లింపు దారులకు వరాలు ప్రకటించిన ఆర్థిక మంత్రి

లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. ప్రముఖ సూక్తులు, మహానీయుల మాటలను గుర్తు చేస్తూ దాదాపు రెండు గంటలకుపైగా ఆమె బడ్జెట్‌ ప్రసంగం కొనసాగింది. భారత్‌ను 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దడమే తమ ముందున్న లక్ష్యమన్నారు నిర్మలా సీతారామన్‌. అందుకు పలు లక్ష్యాలతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. ముఖ్యంగా కార్పోరేట్‌లకు, పన్ను చెల్లింపు దారులకు వరాలు ప్రకటించారు ఆర్థిక మంత్రి. 5 లక్షల వరకు ఆదాయం గలవారు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. దాదాపు 400 కోట్ల వరకూ టర్నోవర్ గల కంపెనీలకు కార్పొరేట్ పన్ను 25 శాతానికి తగ్గించారు. పరిమితి పెంపుతో 99శాతం కంపెనీలకు ప్రయోజనం చేకూరనుంది. ఇక అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రిసిటీ వాహనాలకు ప్రోత్సాహం అందిస్తామన్న నిర్మల. చిన్న దుకాణదారులకు పెన్షన్ పథకం అందిస్తామని ప్రకటించారు. బీమా రంగంలో 100శాతం FDIలకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు. క్రీడలను ప్రోత్సహించేందుకు "ఖేలో ఇండియా" పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఏవియేషన్, మీడియా, యానిమేషన్ రంగాలలో FDIలను ప్రోత్సహిస్తామని నిర్మలా ప్రకటించారు. మరోవైపు ఈ బడ్జెట్‌లో మహిళలకు కూడా కేంద్రం పెద్ద పీట వేసింది. స్వయం సహాయ మహిళా సంఘాలకు నిర్మలా సీతారామన్ వరాలు ప్రకటించారు. జన్‌ధన్ ఖాతా ఉన్న ప్రతి స్వయం సహాయక బృందంలోని మహిళకు రూ. 5 వేల ఓవర్‌డ్రాఫ్ట్ అందిస్తామని తెలిపారు. స్వయం సహాయక బృందాల మహిళలకు తక్కువ వడ్డీ పథకం పొడిగిస్తామన్నారు. దళితులకు దన్నుగా నిలుస్తున్న "స్టాండప్ ఇండియా"కు మరింత ప్రోత్సాహం అందిస్తామని బడ్జెట్‌లో ప్రసంగంలో నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story