తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు..

తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు..

తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల రుసుములు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఫీజులు మూడేళ్లపాటు అమల్లో ఉండనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో 103 ఇంజినీరింగ్ కాలేజీలకు పూర్తి స్థాయి రుసుములు ఖరారు చేశారు. హైకోర్టును ఆశ్రయించిన 80 కాలేజీలతో పాటు.. టీఏఎఫ్ఆర్సీ సిఫార్సు చేసిన మరో 20 కాలేజీలకు ఫీజులను నిర్దారిస్తూ విద్యా శాఖ జీవో జారీ చేసింది. మిగతా 103 ఇంజినీరింగ్ కాలేజీల్లో తాత్కాలికంగా 15 నుంచి 20 శాతం పెంచారు. ప్రతిపాదిత ఫీజు 50వేలకు మించిన కాలేజీలకు ప్రస్తుత రుసుములో 15 శాతం.. ప్రతిపాదిత రుసుము 50 వేలు లేదా అంతకన్నా తక్కువగా ఉంటే ప్రస్తుత ఫీజులో 20 శాతం తాత్కాలికంగా పెంచారు. తాజా పెంపుతో రాష్ట్రంలో 22 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజు లక్ష రూపాయలకు పైగా చేరింది. అత్యధికంగా హైదరాబాద్‌లోని సీబీఐటీలో లక్ష 34వేల రూపాయల ఫీజు ఖరారైంది. కనీస ఫీజు 35 వేల రూపాయలుగా పేర్కొన్నారు. దీంతో ఇన్ని రోజులుగా వాయిదా పడిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది.

Tags

Read MoreRead Less
Next Story