కుమార్తె అశ్లీల చిత్రాలు చూసి ఉరేసుకున్న తండ్రి.. ఆగిన చిన్నాన్న గుండె ..

కుమార్తె అశ్లీల చిత్రాలు చూసి ఉరేసుకున్న తండ్రి.. ఆగిన చిన్నాన్న గుండె ..

తిన్నా తినకపోయినా పరువు మర్యాద కాపాడుకోవాలి. నలుగురు వేలెత్తి చూపేలా ప్రవర్తించకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎదుటి వారికి అవకాశం ఇవ్వకూడదు. బుద్దిగా చదువుపై శ్రద్ధపెట్టు. ప్రేమా దోమా అంటూ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఇలా తండ్రి ఎన్ని మాటలు చెప్పినా కూతురు చెవికి ఎక్కలేదు. ఫలితంగా నాన్న, చిన్నాన్నల ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా, కౌలా గ్రామానికి చెందిన యువతి ప్రేమ పేరుతో ఓ యువకుడి వెంట తిరిగింది. మూడు నెలల క్రితం విషయం పెద్దలకు తెలిసి గొడవ జరిగింది. యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడి కుటుంబంలోని ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ మధ్యే వారు బెయిల్‌పై బయటకు వచ్చారు.

ఆ తరువాత కూడా ఇరు కుటుంబాల మధ్యా గొడవలు జరిగాయి. ఈ క్రమంలో వారిద్దరు సన్నిహితంగా ఉన్న చిత్రాలు వైరల్ అయ్యాయి. అవి చూసిన అమ్మాయి తండ్రి గ్రామంలో ఎలా తలెత్తుకుని తిరిగేదని మదన పడ్డాడు. వెంటనే సమీపంలోని అడవికి వెళ్లి ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. అన్న మరణించాడన్న వార్త విని తమ్ముడు గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలించేంతలోనే అతడూ మరణించాడు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములిద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story