అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన నాదెండ్ల

అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన నాదెండ్ల

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరారు. కేంద్ర హోమ్ శాఖా మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నెలరోజులపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన తనయుడు మనోహర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చిట్టచివరి స్పీకర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో కీలకనేతగా ఉన్నారు. మరోవైపు భాస్కరరావుతో పాటు రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story