హాజీపూర్‌లో పాడుబడ్డ బావులను పూడ్చివేస్తున్న అధికారులు

X
By - TV5 Telugu |6 July 2019 3:40 PM IST
హాజీపూర్‌లో పాడుబడ్డ బావులను రెవెన్యూశాఖ అధికారులు పూడ్చివేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని మొత్తం మూడు బావులను పూడ్చివేస్తున్నారు. హాజీపూర్ సీరియల్ మర్డర్డ్స్ నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
రెండు నెలల క్రితం హాజీపూర్‌లో జరిగిన సీరియల్ మర్డర్స్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి. హాజీపూర్ మర్డర్ క్రైం థ్రిల్లర్‌ను తలపించింది. ముగ్గురు బాలికలపై అత్యాచారం, ఆ తరువాత హత్య చేసిన నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి... ఈ పాడుబడ్డ బావుల్లోనే వేశాడు. శ్రావణి, మనీషా, కల్పనలను బావిలో పూడ్చిపెట్టాడు. బావులు ఎప్పటికైనా ప్రమాదం అని భావించిన అధికారులు వాటిని పూడ్చే ప్రయత్నాలు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com