హిందూపురం జిల్లాగా మారబోతుందన్న వార్తల నేపథ్యంలో..

హిందూపురం జిల్లాగా మారబోతుందన్న వార్తల నేపథ్యంలో..

ప్రతి పార్లమెంట్ ను జిల్లా కేంద్రంగా చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీని నెరవేర్చేందుకు జిల్లా అధికారులు ప్రతిపాధనలు పంపారు. ఈనేపథ్యంలో.. హిందూపురం జిల్లాగా ఖరాయయ్యే అవకాశాలుమెండుగా ఉన్నాయి. హిందూపురం పార్లమెంట్ పరిధిలో 3 రెవెన్యూ డివిజన్లు, 34 మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. హిందూపురం స్ఫెషల్ గ్రేడ్ మున్సిపాలిటిగా మడకశిర, పుట్టపర్తి నగరపంచాయితీలుగా ఉన్నాయి.

కేంద్రరాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ,పెద్ద మార్కెట్ యార్డుతో పాటు ఆసియాలోనే పెద్ద చింతపండు మార్కెట్ హిందూపురంలో ఉంది. ఇక.. ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ములుగూరు,కొటిపి ప్రాంతాల్లో 1300 ఎకరాల భూమిని ఇప్పటికే ఎపిఐఐసి సేకరించి పెట్టింది. అహ్లదకరమైన ,ప్రశాంత వాతావరణానికి హిందూపురం పెట్టింది పేరు. జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు భూమితో పాటు తాగునీటి సమస్య కూడ లేకుండా ఉండాలి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి తాగునీటిని సరఫరా చేసేందుకు హిందుపురం వరకు ప్రత్యేక పైపు లైను ఏర్పాటు చేసింది. దీంతో.. తాగునీటి సమస్య లేకుండా పోయింది. మరో వైపు..రాష్ట్రంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇక్కడ ఉంది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తన హయాంలోనే ఇక్కడ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసారు. దీంతో.. ఇక్కడ పెద్ద పెద్ద కర్మాగారాలు వెలిశాయి. దీనికి తోడు..6 కిలోమీటర్ల దూరంలో బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగుళూరు -హైదరాబాద్ జాతీయ రహదారి ఉండటంతో హిందూపురాన్ని జిల్లాగా చేసేందుకు అన్ని విదాలుగా అనుకూలంగా ఉంటుందని పలువురు బావిస్తున్నారు. అయితే.. హిందూపురం జిల్గాగా ఏర్పాటు చేస్తే ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు రావాలంటే దూరం ఎక్కువగా ఉంటుంది. దాదాపు కర్ణాటక సరిహద్దుకు రావాల్సి ఉంటుంది. ఇదొక్కటే హిందూపురం జిల్లా కావడానికి ప్రతికూల అంశంగా భావించవచ్చు.

హిందూపురం జిల్లా కేంద్రంగా మారబోతుందన్న వార్తల నేపద్యంలో అనంతపురానికి చెందిన రియల్టర్లు,వ్యాపారస్తులతో పాటు ఇతర జిల్లాల వాసులు, పక్కనున్న కర్ణాటక రాష్ట్ర ప్రజలు సైతం హిందూపురంలో భూముల కొనుగోలు చేస్తున్నారు. స్దానిక బ్రోకర్ల సాయంతో ఎకరాల కొద్దీ భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ప్రతి రోజు 60 నుంచి 100 ఎకరాల వరకు భూమి రిజిస్ట్రేషన్ అవుతున్నట్లు సబ్ రిజిస్ట్రార్ చెబుతున్నారు. తమ టార్గెట్ కు మించి డబ్బులు ఖజానాకు చెల్లిస్తున్నామని చెబుతున్నారు.

మరోవైపు..పెనుకొండను జిల్లా కేంద్రం చేయాలని పెనుకొండ జిల్లా సాధన సమితి పేరుతో విద్యార్దులు,పట్టణవాసులు,మేధావులు పెద్ద ర్యాలీ నిర్వహించారు. పెనుకొండను జిల్లా కేంద్రం చేయాలని పెద్దపెట్టున నినాదాలు చేస్తూ.. . శ్రీక్రష్టదేవరాయల విగ్రహం వద్ద టెంకాయలు కొట్టి జిల్లా సాధిం చేవరకు పోరాటం ఆగదని ప్రతిజ్ణ చేశారు. పెనుకొండ ఇప్పటికే రెవెన్యూ డివిజన్ గా కొనసాగుతున్నందున ,పలు ప్రభుత్వ కార్యాయలాలు ,భవనాలు ఇక్కడ ఉన్నాయని చెబుతున్నారు. అన్ని ప్రాంతాలకు మధ్య పెనుకొండ ఉండటంతో ప్రజలు జిల్లా కేంద్రానికి రావడానికి సులభంగా ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండ చారిత్మాత్ర్మక కేంద్రంగా పెనుకొండకు గుర్తింపు ఉందని.. కియాకార్ల ప్యాక్టరీతో అంతర్జాతీయంగా ఈ ప్రాంతానికి మంచి పేరు వచ్చిందని చెబతున్నారు. ఇన్ని అర్హతలున్న పెనుకొండను జిల్లా చేస్తే ఈ ప్రాంతం బాగా అభివృద్ది చెందుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరో వైపు..ప్రముఖ ఆద్యాత్మిక కేంద్రం పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేయాలని సత్యసాయిబాబా బతికున్నప్పటి నుంచి ప్రపోజల్ ఉంది . ఈ నేపద్యంలో.. పుట్టపర్తిని జిల్లాగా చేస్తే బాగుంటుందని పలువురు స్దానిక ప్రజాప్రతినిదిపై ఒత్తిడి పెంచుతున్నారు. దేశ విదేశీయులు పుట్టపర్తికి వస్తుంటారని ఈ నేపధ్యంలో పుట్టపర్తిని జిల్లాగా చేస్తే మరింతగా అభివ్రుద్ది చెందుతుందని స్దానికులు చెబుతున్నారు. ఒక వేళ పుట్టపర్తిని జిల్లాగా చేయకపోయినా కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు సత్యసాయి జిల్లాగా పేరుపెట్టాలని కోరుతున్నారు.

హిందూపురంను జిల్లాగా చేస్తే అనంతపురానికి కిలో మీటర్ దూరంలో ఉన్న రాప్తాడు నియోజకవర్గంలోని ప్రాంతాల వారు వారి అవసరాల కోసం 120 కిలో మీటర్ల దూరంలో ఉండే హిందూపురానికి వెళ్లాంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ నేపధ్యంలో.. రాస్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్, రాప్తాడు,ఆత్మకూరు మండలాలతో పాటు బత్తలపల్లిలోని కొన్ని గ్రామాలను అనంతపురం జిల్లాలో కలపాలని స్థానికులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story