ఆ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు

ఆ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు

నియామక ఉత్తర్వుల కోసం గతకొంతకాలంగా ఆందోళన చేస్తున్న టీఆర్‌టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. టీఆర్‌టీ నియామక ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థులకు వీలైనంత త్వరగా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ఆ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి సర్కారు స్పష్టం చేసింది. దీంతో ఈ నెలాఖరులోగా ఉత్తర్వులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.

ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్‌టీలో స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ తదితర ఉద్యోగాలకు 7,414 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. కోర్టు వివాదాల కారణంగా మరో 1,378 పోస్టుల ఫలితాలు ఇంకా ప్రకటించలేదు. ఏప్రిల్ నాటికే టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసినప్పటికీ నియామక ఉత్తర్వులు ఇవ్వడంలో మాత్రం విద్యాశాఖ జాప్యం చేస్తోంది. దీంతో టీఆర్‌టీకి ఎంపికైన అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి లోనై.. వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. దీంతో ఎట్టకేలకు నియామక ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చే ప్రక్రియను చేపట్టాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story