పుట్టిన రోజు వేడుకల్లో అపశ్రుతి.. కాలిపోయిన యువకుడి ముఖం
BY TV5 Telugu7 July 2019 8:33 AM GMT

X
TV5 Telugu7 July 2019 8:33 AM GMT
పుట్టిన రోజు వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. సరదా కోసం వేడుకల్లో స్నో స్ప్రే కారణంగా పుట్టిన రోజు జరుపుకుంటున్న యువకుడి ముఖమంతా కాలిపోయింది. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఈఘటన చోటు చేసుకుంది. యువకుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.మండపేట కలవపువ్వు సెంటర్‌లో స్నేహితులతో కలిసి యువకుడు బర్త్ డే కేక్ క్యాండిల్ వెలిగించాడు. తోటి స్నేహితులు సరదాగా ఆ యవకుడి తలపై స్ప్రే చల్లారు. ఎక్కువగా చల్లడంతో క్యాండిల్ మంటలు ఒక్కసారిగా యువకుడికి అంటున్నాయి. దీంతో యువకుడి ముఖమంతా కాలిపోయింది.
Next Story