బుల్లితెర రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే..

బుల్లితెర రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే..

ప్రతి వారం లానే ఈ సారి కూడా బుల్లితెర రేటింగ్స్ రెడీగా ఉన్నాయి. ముందుగా జూన్ 22 నుంచి 28 వరకు రేటింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం...

గతంలో మాదిరిగా ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా ధియేటర్ల వైపు పరుగులు పెట్టడం లేదు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు. వీరికి కావలసినంత వినోదం స్మాల్ స్క్రీన్ లో దొరుకుతుంది. సీరియల్స్, వీక్లి ప్రోగ్రామ్సే కాదు, రిలీజైన తక్కువ రోజుల్లోనే సినిమాలు కూడా బుల్లితెరపై ప్రత్యక్షమవుతున్నాయి. అందుకే స్మాల్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ మీద చాలా డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్లుగానే చానల్స్ మధ్య కూడా గట్టి పోటీ నడుస్తోంది. ఈ వారం కూడా నంబర్ వన్ ప్లేస్ స్టార్ మాటివికే దక్కింది.

మిగతా చానల్స్ ఎంత ప్లాన్ చేసినా, ప్రస్తుతం మాటివి దూకుడును తట్టుకోవడం కష్టంగా ఉంది. కొత్త కొత్త సీరియల్స్ తో, క్రేజీ సినిమాలతో మాటివి బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందుకు తగ్గట్లే రేటింగ్ కూడా ఎక్కువగా వస్తోంది. ఓవరాల్ గా స్టార్ మాటివి ఈ వారం 749 పాయింట్లతో నంబర్ వన్ పొజిషన్లో ఉంది. స్టార్ మాటివికి ఈ రేంజ్ లో రేటింగ్ రావడానికి కారణం సీరియల్స్. ఈ చానల్ లోని సీరియల్స్ కి ఎవరూ ఊహించని రేటింగ్ వస్తోంది. ఇండివిడ్యువల్ గా ప్రతి వారం కార్తీకదీపం సీరియల్ టాప్ ప్లేస్ లో ఉంటోంది. మొదటి ఆరు స్తాలు ఆ సీరియల్ కే దక్కుతున్నాయి. ఈ వారం కార్తీకదీపం సీరియల్ కి 14.71 పాయింట్ల రేటింగ్ వచ్చింది. విడిపోయిన కొడుకు, కోడలిని కలపాలని ప్రయత్నించే అత్త కథే కార్తీకదీపం. ప్రతి ఎపిసోడ్ సస్పెన్స్ తో, తెరకెక్కిస్తూ బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తోంది కార్తీకదీపం సీరియల్ టీమ్.

మాటివిలో, కొత్తగా స్టార్ట్ అయిన సీరియల్స్ కి తక్కువ టైమ్ లోనే క్రేజ్ వచ్చింది. అలాంటి సీరియల్స్ లో మౌనరాగం ఒకటి. కొద్ది నెలల క్రితం ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పుడు ఓవరాల్ రేటింగ్స్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ వారం మౌనరాగం సీరియల్ కి వచ్చిన రేటింగ్ 9.93 పాయింట్లు. ఇందులో లీడ్ రోల్ మూగ అమ్మాయిగా నటించింది. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న ఈ సీరియల్ కి మంచి ఆదరణ లభిస్తోంది.

స్టార్ మాటివి సీరియల్స్ లో ఎక్కువ రేటింగ్ తెచ్చుకుంటున్న మరో సీరియల్ కోయిలమ్మ. ఈ సీరియల్ చిన్న పిల్లల నేపథ్యంలో నడిచినప్పుడు అంతగా రేటింగ్ లేదు. కానీ స్టోరీని చేంజ్ చేసి, పిల్లలు పెద్దయ్యాక సాగే కథ అందర్నీ మెప్పిస్తోంది. దీంతో రేటింగ్ లోనూ మార్పులొచ్చాయి. కోయిలమ్మకి ఈ వారం 9.67 పాయింట్లు వచ్చాయి. ఇక ఆ తర్వత కథలో రాజకుమారి సీరియల్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సీరియల్ లోని అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. కథలో రాజకుమారికి ఈ వారం రేటింగ్ 6.30 పాయింట్లు.

మాటివిలో గత నెలలో వదినమ్మ సీరియల్ మొదలైంది. బుల్లితెర స్టార్ యాక్ట్రెస్ సుజిత ఇందులో లీడ్ రోల్ పోషించింది. ప్రభాకర్, శివపార్వతి కీ రోల్స్ చేశారు. నెల రోజుల్లోనే ఈ సీరియల్ టాప్ రేటింగ్ సీరియల్స్ ఉన్న లిస్ట్ లో చేరింది. వదినమ్మకి ఈ వారం 6.91 పాయింట్లు దక్కాయి. ఇవి కాక మాటివిలో ప్రేక్షకాదరణ పొందుతున్న సీరియల్స్ లో కుంకుమపువ్వు ఒకటి. ఆ తర్వాత అగ్నిసాక్షికి ఆదరణ కనిపిస్తోంది. వీటితో పాటు సావిత్రమ్మగారి అబ్బాయి సీరీయల్స్ కి 4 పాయింట్ల కంటే ఎక్కువే రేటింగ్ వస్తోంది. ఇక 3 పాయింట్లకు పైన కృష్ణవేణి, లక్ష్మికల్యాణం, కంటే కూతుర్నే కను, కనులు మూసినా నీవాయే సీరియల్స్ రేటింగ్స్ సాధిస్తున్నాయి. మొత్తంగా సీరియల్స్ వల్లే స్టార్ మాటివి ప్రతి వారం నంబర్ వన్ పొజిషన్లో ఉంటోంది.

సీరియల్స్ తో పాటు వీక్లి ప్రోగ్రామ్స్ తో బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది ఈటివి. సీరియల్స్ కంటే ఇందులో వీక్లి ప్రోగ్రామ్స్ కే ఎక్కువ రేటింగ్ వస్తోంది. అయితే సీరియల్స్ కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి. అందుకే నంబర్ వన్ ప్లేస్ లో ఉన్న స్టార్ మాటివితో పోటీ పడలేకపోయినా... జీతెలుగు, జెమిని టివిల కన్నా ఎక్కువగా రేటింగ్ సాధిస్తోంది ఈటివి.

ఈటివి ఈ వారం ఓవరాల్ రేటింగ్స్ లో సెకండ్ ప్లేస్ సాధించింది. ఇండివిడ్యువల్ గా చూస్తే....ఈటివి చానల్ లో, రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ అయ్యే న్యూస్ బులెటిన్ కి ఎక్కువ రేటింగ్ వస్తోంది. తర్వాత వీక్లి ప్రోగ్రామ్స్ అయిన జబర్ధస్త్, డీ జోడీ, క్యాష్ వంటి షోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక సీరియల్స్ లో స్వాతి చినుకులు, మనసు మమత, నా పేరు మీనాక్షి సీరియల్స్ ఆకట్టుకుంటున్నాయి. వీటి తర్వాత అభిషేకం, అత్తారంటికి దారేది వంటి సీరియల్స్ ఆకట్టుకుంటున్నాయి. జబర్థస్త్ షోలకు ఈ వారం 6 పాయింట్లు దక్కాయి. ఇక సీరియల్స్ కి స్వాతి చినుకులు, మనసు మమస వంటి సీరియల్స్ కి 5 పాయింట్లు దక్కాయి. మిగతా సీరియల్స్ కి 3 లేదా 4 పాయింట్లతో సరిపెట్టుకుంటున్నాయి.

జీ తెలుగు చానల్ ఈ వారం థర్డ్ ప్లేస్ లో ఉంది. ఈ చానల్ లోని సీరియల్స్ కి రేటింగ్ బాగానే వస్తోంది. కానీ ఈవారం మాత్రం ఇండివిడ్యువల్ గా సీరియల్స్ ని మించి సినిమాకి రేటింగ్ ఎక్కువ వచ్చింది. అవును...అల్లు శిరీష్ నటించిన కొత్త సినిమా ఎబిసిడి మూవీ ఫస్ట్ టైమ్ జీ తెలుగులో ఈ వారమే టెలికాస్ట్ అయ్యింది. ఆ సినిమాకి దాదాపు 6 పాయింట్ల రేటింగ్ వచ్చింది.

జీ తెలుగులో సీరియల్స్ లో టాప్ రేటింగ్ సాధించిన సీరియల్ రక్తసంబంధం. కొద్ది వారాలుగా జీ తెలుగులో రక్తసంబంధమే టాప్ రేటింగ్ సాధిస్తోంది. ట్విస్ట్ లతో సాగే ఈ సీరియల్ కి రేటింగ్ బాగానే వస్తోంది. ఈ వారమైతే రక్తసంబంధం సీరియల్ కి 5.45 పాయింట్ల రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత కళ్యాణ వైభోగమే సీరియల్ కి 5 పాయింట్ల సాదించింది.

జీ తెలుగులో ఆదరణ పొందుతున్న సీరియల్స్ లో గుండమ్మ కథ ఒకటి. ఈ సీరియల్ కి 4.60 పాయింట్లు వచ్చాయి. ఆ తర్వాత మాటేమంత్రము సీరియల్ కి 4.57 పాయింట్లు దక్కాయి. అలాగే గంగ మంగ సీరియల్ కి 4.33 పాయింట్లు వచ్చాయి. మిగతా సీరియల్స్ కేవలం 3 పాయింట్ల రేటింగ్ ని మాత్రమే సాధిస్తున్నాయి. జీ తెలుగు చానల్ టాప్ ప్లేస్ కి వెళ్ళాలంటే సీరియల్స్ కి మరింత రేటింగ్ పెరిగాల్సి ఉంటుంది.

జెమిని టివి ఎప్పట్లానే ఫోర్త్ ప్లేస్ లో ఉంది. ఈ చానల్ లోని సీరయల్స్ కి ఈ మధ్య రేటింగ్ పెరుగుతోంది. ఈ వారం జెమినిలో టాప్ రేటింగ్ సాధించిన సీరియల్ రెండు రెళ్ళ ఆరు. ఈ సీరియల్ కి 5.44 పాయింట్లు దక్కాయి. ఆ తర్వాత పౌర్ణమి సీరియల్ కి 4.77 పాయింట్లు దక్కాయి. ఇక రోజా, అక్క మొగుడు సీరియల్స్ కి 4 పాయింట్ల రేటింగ్ వచ్చింది. జెమినిలోని మిగతా సీరియల్స్ కి 3 పాయింట్ల రేటింగ్ మాత్రమే వచ్చింది.

బుల్లితెర ప్రేక్షకుల్లో ఎక్కువ శాతం మహిళలో ఉంటారు. అందుకే సీరియల్స్ కి స్మాల్ స్క్రీన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ఈ మధ్య మగవారు కూడా బుల్లితెరతోనే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. అందుకు కారణం వీక్లి ప్రోగ్రామ్స్. వీటికి మహిళలతో పాటు మగవారి నుంచి కూడా ఆదరణ ఉంది. అందుకే కొన్ని వీక్లి ప్రోగ్రామ్స్ కి టాప్ రేటింగ్ సాధిస్తూ, ఆయా చానల్స్ టాప్ పొజిషన్స్ లో నిలవడానికి సపోర్ట్ ఇస్తున్నాయి.

కొద్ది కాలంగా బుల్లితెర మీద వీక్లి ప్రోగ్రామ్స్ కి క్రేజ్ పెరిగింది. కామెడీ షోలు, డాన్స్ బేస్డ్ షోలు, రియాలిటీ షోల వల్ల, ఆడియన్స్ కి స్మాల్ స్క్రీన్ మీద చాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. తెలుగులో టాప్ ఫోర్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ అయిన మాటివి, జీ తెలుగు, ఈటివి, జెమిని టివిలలో చూస్తే...వీక్లి ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఈటివిలోనే ఉంటున్నాయి.

ప్రతి వారం ఈటివి సెకండ్ ప్లేస్ లో ఉండటానికి మెయిన్ రీజన్ వీక్లి ప్రోగ్రామ్స్. ఈ చానల్ జబర్ధస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలు, డాన్స్ బేస్డ్ డీ షో, మూవీ బేస్డ్ ఇంటర్వ్యూస్ ఆలీతో సరదగా, సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ వంటి ప్రోగ్రామ్స్ కి రేటింగ్ బాగా వస్తున్నాయి. వీటికి వచ్చే రేటింగ్ ఈటివికి చాలా ప్లస్ అవుతోంది.

ఈటివిలో వీక్లి ప్రోగ్రామ్స్ లో నటుడు ఆలీ హోస్ట్ చేస్తున్న షో ఆలీతో సరదాగా. ఈ షోలో వెటరన్ స్టార్స్ ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఆ ఇంటర్వ్యూల్లో ఎవరికీ తెలియని స్టార్స్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని, ఆడియన్స్ కి తెలియజేస్తున్నాడు ఆలి. ఈ షోకి రేటింగ్ బాగానే వస్తోంది. ఆలీతో సరదాగా ప్రతి సోమవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ అవుతోంది.

ఈటీవిలోనే వస్తున్న మరో వీక్లి ప్రోగ్రామ్ క్యాష్. సుమ హోస్ట్ చేస్తున్న ఈ షోతో ఫన్ ఎక్కువగా జనరేట్ అవుతోంది. సినిమా స్టార్స్ కావచ్చు, లేక బుల్లితెర సెలబ్రిటీస్ ని కాని గెస్ట్ లుగా పిలిచి, వారితో ఫన్ క్రియేట్ చేస్తోంది సుమ. ఈ షోకి మంచి పాపులారిటీ ఉంది. రేటింగ్ కూడా బాగానే వస్తోంది.

బుల్లితెర మీద వీక్లి ప్రోగ్రామ్స్ లో ఎక్కువ క్రేజ్ ఉంది జబర్థస్త్ అండ్ ఎక్స్ ట్రా జబర్ధస్త్ షోలకు. అందులోని స్కిట్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈటివిలో ప్రతి గురువారం, శుక్రవారం టెలికాస్ట్ అవుతున్న ఈ గంటన్నర ఎపిసోడ్ కి విపరీతమైన వ్యూవర్ షిప్ ఉంది. అలాగే రేటింగ్ కూడా ఎక్కువగానే వస్తోంది.

బుల్లితెర మీద ఎక్కువ వ్యూవర్ షిప్ ఉన్న వీక్లి ప్రోగ్రామ్స్ జబర్ధస్త్ అండ్ ఎక్స్ ట్రా జబర్ధస్త్. ఈ రెండు షోలకు రిపిటీ టెలికాస్ట్ అయినప్పుడు కూడా రేటింగ్ బాగానే వస్తోంది. నాగబాబు, రోజా జడ్డిలుగా వ్యవహరించే ఈ షోలోని స్కిట్స్ కి ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఈ షోలకు అనసూయ, రష్మిల గ్లామర్ కూడా ప్లస్ అవుతోంది.

ఈ కామెడీ షోల్లో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర స్కిట్స్ కి ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. తన పంచ్ డైలాగులతో హైపర్ ఆది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ కూడా మంచి మంచి కాన్సెప్ట్ లతో స్కిట్స్ చేసి మెప్పిస్తున్నారు. ఇక చమ్మక్ చంద్ర పెళ్ళి, భార్య నేపథ్యంలో స్కిట్స్ చేసి అలరిస్తున్నాడు. వీరితో పాటు కిరాక్ ఆర్.పి, చలాకీ చంటి, బుల్లెట్ భాస్కర్, వెంకీ మంకీస్ అండ్ టీమ్ నుంచి వస్తున్న స్కిట్స్ కూడా ఆకట్టుకుంటూ మంచి రేటింగ్ సాధిస్తున్నాయి.

ఈటివిలో టెలికాస్ట్ అవుతున్న మరో ఇంట్రెస్టింగ్ వీక్లి షో. డీ జోడీ. ఈ డాన్స్ బేస్డ్ షోకి శేఖర్ మాస్టర్, ప్రియమణి, జడ్జిలుగా ఉన్నారు. ప్రదీప్ హోస్ట్ చేస్తున్నాడు. రెండు టీమ్స్ కి రష్మి, సుధీర్ లీడర్స్. అదిరిపోయే డాన్సులతో ఈ షో పుల్ ఎంటర్టైన్మెట్ ని అందిస్తోంది. అలాగే షో మధ్యలో సుడిగాలి సుధీర్ ని ఆటపట్టించే సీన్స్ ఎంటర్టైన్మెంట్ ని ఇస్తున్నాయి. దీంతో ఈ షోకి కూడా రేటింగ్ బాగానే వస్తోంది.

ఈటివిలో ఎక్కువ వీక్లి ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ, మాటివి, జెమిని, జీ తెలుగులోనూ కొన్ని ప్రోగ్రామ్స్ అలరిస్తున్నాయి. మాటివిలో మా పరివార్ లీగ్ ఆకట్టుకుంటోంది. అలాగే జెమిని టివిలో డాన్స్ బేస్డ్ షో రంగస్థలం మెప్పిస్తోంది. ఇక జీ తెలుగు డ్రామా జూనియర్స్, బతుకు జట్కా బండి వంటి షోలు ఎట్రాక్ట్ చేస్తూ మంచి రేటింగ్ సాధిస్తున్నాయి.

మొత్తంగా బుల్లితెర ప్రేక్షకులకు ఒక పక్క సీరియల్స్, మరో పక్క వీక్లి ప్రోగ్రామ్స్ తో ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది.

Tags

Read MoreRead Less
Next Story