విజయవాడలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

విజయవాడలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ అవతరించిందని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విజయవాడలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ రోజు రోజుకూ కనుమరుగవుతోందని విమర్శించారు. ఆపార్టీ అధ్యక్షుడు ఎవరో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. పుల్వామా దాడి తర్వాత భారత్‌కి చైనా మద్దతు ఇచ్చిందని చెప్పారు. బీజేపీ దౌత్యనీతిని పాటిస్తుందని అందుకే ఇతర దేశాలు మనల్ని గౌరవిస్తున్నాయని కిషన్ రెడ్డి అన్నారు.

ప్రపంచ దేశాలు భారత్‌ వైపు చూస్తున్నాయని సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే నాయకుడు మోదీ మాత్రమేనని కొనియాడారు. త్వరలోనే మూడు ఆగ్రదేశాల జాబితాలో భారత్ చేరుతుందన్నారు.

Next Story