పారిశ్రామికవేత్త రాంప్రసాద్‌ కేసు.. ఆ ప్లాన్‌ను పసిగట్టిన సత్యం..

పారిశ్రామికవేత్త రాంప్రసాద్‌ కేసు.. ఆ ప్లాన్‌ను పసిగట్టిన సత్యం..

పారిశ్రామికవేత్త రాంప్రసాద్.. మర్డర్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయ్. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోగంటి సత్యం అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత నెల 25న కోగంటి సత్యంను లారీతో ఢీకొట్టి చంపేందుకు.. రాంప్రసాద్ ప్లాన్ చేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని పసిగట్టిన సత్యం.. రాంప్రసాద్ మర్డర్ కు స్కెచ్ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో కోగంటి సత్యం ను చంపేందుకు ప్లాన్ చేసిన లారీ డ్రైవర్ ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

రెండ్రోజుల క్రితం హైదరాబాద్ పంజాగుట్టలో నడిరోడ్డుపైనే రాంప్రసాద్‌ ను కత్తులతో నరికిచంపడం సంచలనం సృష్టించింది..ఈ మర్డర్ కు ఆర్ధిక లావాదేవీలే కారణమని భావించారు పోలీసులు. అటు రాంప్రసాద్ కుటుంబ సభ్యులు.. కోగంటి సత్యంపై ఆరోపణలు చేయడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు పురోగతి సాధించారు.కామాక్షి స్టీల్ కంపెనీ వ్యాపార లావాదేవీల్లో భాగంగానే ఈ ఇద్దరి మధ్య విబేధాలు వచ్చినట్లు గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story