ఆగని వైసీపీ దాడులు.. టీడీపీ నేతలే టార్గెట్‌గా స్కెచ్

ఏపీలో వైసీపీ దాడులు ఆగడం లేదు. టీడీపీ కార్యకర్తలు, నేతలే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు వైసీపీ నేతలు. తాజాగా విశాఖ జిల్లాలో మళ్లీ టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. సబ్బవరం మండలం చింతలగట్టు పంచాయితీకి చెందిన టీడీపీ నేత దాసరి గణేష్‌తో సహా మరో ఇద్దరిపై దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు. ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తోన్న గణేష్‌ను దారి కాచి దాడి చేశారు. తలపై తీవ్రంగా కొట్టడంతో గణేష్ స్పృహ కోల్పోయాడు. స్థానిక ఆటో డ్రైవర్లు.... అతడిని ఆసుపత్రికి తరలించారు.
ఈ దాడిని టీడీపీ తీవ్రంగా ఖండించింది. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తనయుడు అప్పలనాయుడు... ఆసుపత్రికి చేరుకని గణేష్‌ను పరామర్శించారు. అటు బాధితుల నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. తనను చంపేందుకే దాడి చేశారంటున్నాడు టీడీపీనేత గణేష్. రక్షణ కల్పించాలంటూ పోలీసులను కోరాడు.
టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులపై.... జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు బండారు అప్పలనాయుడు. ప్రజాస్వామ్యంలో రాజకీయ కక్షలకు తావులేదన్నారు. ఈ ఘటనపై పార్ట అధిష్టానానికి కూడా చెప్పామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com