పూరీ అడిగితే మరిగే ఆయిల్ ముఖంపై..

హోటల్‌కి వెళ్లి పూరీ ఆర్డర్ చేశాడు. ఎంతకీ తీసుకురావట్లేదు.. అరగంట అయిపోయింది. ఆకలితో కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఇక లాభం లేదని మేనేజర్ దగ్గరకి వెళ్లాడు. ఆయన సిబ్బందిని పిలిచి ఏంటి లేటన్నాడు. ఇదిగో తెస్తున్నాం సార్ అంటూ లోపలికి వెళ్లి మరిగే నూనె తీసుకు వచ్చి పూరీ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ ముఖంపై పోశాడు. ఈ ఘటన జరిగింది హైద్రాబాద్ చాంద్రాయణగుట్ట ప్రాంతంలోని ఓ హోటల్లో. హైద్రాబాద్‌కు చెందిన ఓ వ్యాపార వేత్త హోటల్‌కి వెళ్లి పూరీ ఆర్డర్ చేశాడు. అరగంటైనా రాకపోయే సరికి హోటల్ సిబ్బందిని ప్రశ్నించాడు. ఇచ్చిన ప్లేట్ పూరీ ఆర్డర్ ఇంతసేపా అని అడగడంతో మాటా మాటా పెరిగింది. అది కాస్తా గొడవకు దారి తీసింది. మేనేజర్‌కి కంప్లైంట్ ఇస్తావా అంటూ సిబ్బందిలో ఒకరు మరిగే ఆయిల్ తీసుకువచ్చి కస్టమర్ ముఖంపై పోశాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. హోటల్ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com