ఆయన వల్లే నేను..: జబర్దస్త్ క్యారెక్టర్ నెమలి రాజు

ఆయన వల్లే నేను..: జబర్దస్త్ క్యారెక్టర్ నెమలి రాజు

ఓ రైతుకి బిడ్డగా అయితే జన్మించాను కానీ అమ్మానాన్నకి కొడుకుగా ఏమీ చేయలేక పోయాను. వర్షాలు లేక పంటలు పండక నాన్నకు కుటుంబ పోషణ భారం కష్టమైంది. పని ఏమైనా దొరుకుతుందేమోనని ప్రకాశం జిల్లా పొదిలిని వదిలి పట్నం వచ్చాడు నెమలి రాజు. నాన్న కూలి పనుల కోసం విజయవాడ వెళ్లాడు. ఓసారి ఢీ జోడీ షూటింగ్ జరుగుతుంటే చూద్దామని వెళ్లాడు రాజు. అక్కడ పటాస్, జబర్దస్త్ షోల్లో యాక్ట్ చేసే రైజింగ్ రాజు.. నెమలి రాజుని చూసి జబర్దస్త్ చేస్తావా అని అడిగారు. చేస్తానని చెప్పడంతో అతడిని తీసుకెళ్లి రిహార్సల్స్ చేయించారు. lr నచ్చడంతో షోలో తీసుకున్నారని నెమలి రాజు తెలిపారు. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అవడంతో పాటు.. కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నానని, అమ్మానాన్నకి రెండు పూటలా అన్నం పెట్టగలుగుతున్నానని చెప్పాడు. ఎప్పుడూ ఇలాగే ప్రేక్షకులకు వినోదం పంచుతూ, మరింత బాగా నవ్వించే ప్రయత్నం చేస్తానంటున్నాడు రాజు. ఇప్పడు ఎక్కడికి వెళ్లినా నన్ను గుర్తు పట్టేస్తున్నారని అంటున్నాడు. షో ద్వారా ఇంత పాపులారిటీ సంపాదించడం చాలా ఆనందంగా ఉందని చెబుతున్నాడు. ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ దాగి వుంటుంది. అవకాశం వచ్చినప్పుడు, అదృష్టం కలిసివచ్చినప్పుడు అది బయట పడుతుంది. అదే జీవితాన్ని నిలబెడుతుంది అని నెమలి రాజుని చూసి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story