రైతు దినోత్సవంపై లోకేష్ సెటైర్లు

రైతు దినోత్సవంపై లోకేష్ సెటైర్లు

వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తోన్న రైతు దినోత్సవంపై ట్విట్టర్ లో సెటైర్లు వేశారు నారా లోకేష్. వైఎస్ హయాంలో జరిగిన రైతు ఆత్మహత్యలను ఓ కథ రూపంలో వ్యగ్యంగా చెప్పారు. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తూటాలతో రైతుల్ని పిట్టలను కాల్చినట్లు కాల్చారు. దేశంలో అందరూ ఆ రాజుగారి గురించి మాట్లాడుకున్నారు. కాలం గిర్రున తిరిగింది.. ఇప్పుడా రాజుగారి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుతున్నారు.. కాల మహిమ అంటే ఇదే అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు లోకేష్.

Tags

Next Story