మెడికల్ మిరాకిల్.. బిడ్డకు ప్రాణం పోసిన తల్లి పిలుపు

మెడికల్ మిరాకిల్.. బిడ్డకు ప్రాణం పోసిన తల్లి పిలుపు

సూర్యాపేటలో జరిగిన మెడికల్ మిరాకిల్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విషజ్వరం వచ్చి బ్రెయిన్ డెడ్ గా మారిన ఓ యువకుడు మళ్లీ కోలుకోవడంతో ఆ తల్లి సంతోషపడుతోంది. సూర్యాపేట శివారులోని.. పిల్లలమర్రి గ్రామానికి చెందిన కిరణ్ కు విషజ్వరం వచ్చింది. ఏరియా ఆస్పత్రి నుంచి కార్పొరేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించలేదు.. దీంతో 17ఏళ్ల కిరణ్ బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు వైద్యులు. వెంటిలేటర్ తొలగిస్తే ప్రాణాలు పోతాయి. ఇంటికి తీసుకెళ్లండని చెప్పారు డాక్టర్లు.. దీంతో అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో త్లలి సైదమ్మ.. కిరణ్ అంటూ బోరున విలిపించడం... ఆ పిలుపుకు కిరణ్ కళ్ల నుంచి నీరు రావడంతోపాటు కాళ్లు, చేతులు కూడా కదలించాడు.

Tags

Read MoreRead Less
Next Story