మీకు తెలుసా!! నిత్యానంద 40 నిమిషాల పాటు సూర్యుడ్ని..

మీకు తెలుసా!! నిత్యానంద 40 నిమిషాల పాటు సూర్యుడ్ని..

ఏం మాయ జేస్తివి.. ఏం మాయ జేస్తివి.. ఏకంగా సూర్యోదయాన్నే ఆపేస్తివా స్వామి. మీ అద్భుత లీలలకు అమాయకపు భక్తులు పాదాక్రాంతులవుతున్నారు. అదే కదా స్వామి మీకు అవకాశంగా మారింది. కాకపోతే ఏవిటండి.. స్వామీ నిత్యానంద ఏకంగా సూర్యోదయాన్ని 40 నిమిషాలు ఆపేశారట. నేను చాలా బిజీ నన్ను కలవడానికి ఓ గంట వరకు ఏవర్నీ రావద్దని చెప్పండి అని ఆఫీస్‌లో బాస్ ఆర్డర్ చేసినట్లుంది స్వామి గారి నిర్వాకం. ఈ విషయాన్ని స్వామి వారే స్వయంగా చెప్పారు మరి. బెంగుళూరులోని బిడది ఆశ్రమ వ్యవస్థాపకుడు నిత్యానంద. ఆయన లీలలు ఇదివరకే జనులకు ఎరుక. అయిననూ ఆశ్రమానికి భక్తులు తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. వారి వీక్ పాయింట్‌ని ఆసరాగా చేసుకునే స్వామి వారు ప్రవచనాలు వల్లిస్తుంటారు.

రోజూ ఆశ్రమంలో నిత్యానంద స్వామి ధ్వజారోహణ చేస్తుంటారు. తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందే ధ్వజారోహణ కార్యక్రమం పూర్తవుతుంటుంది. అయితే వారం రోజుల క్రిందట ధ్వజారోహణ కాస్త ఆలస్యంగా జరిగింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో.. స్వామి స్పందించి.. ఆ రోజు ఆలస్యం కాలేదు.. సూర్యోదయం కాకుండా నేనే అడ్డుకున్నా. సూర్యుడిని 40 నిమిషాల తరువాత ఉదయించమన్నాను. సూర్యుడు నా మాట విన్నాడు. ఆ రోజు ఆకాశం కూడా నిర్మలంగా ఉంది. కావాలంటే గూగుల్ డేటా చూసుకోండి అని సవాల్ విసిరారు స్వామీ నిత్యానంద. స్వామీ మీరు సూపర్.. సూర్యుడిని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో నిత్యానంద స్వామి వ్యాఖ్యలు తెగ ట్రోల్ అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story