కట్టుకున్న భర్తనే కడతేర్చింది

కట్టుకున్న భర్తనే కడతేర్చింది

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తనే కడతేర్చింది. కసాయి భార్య. ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన నాయుడి గంగారాం అతని భార్య గంగవ్వకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తరచు గొడవపడుతున్న భర్తను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న గంగవ్వ నిన్న రాత్రి దారుణానికి ఒడిగట్టింది. అర్ధరాత్రి గంగారాం నిద్రిస్తున్న సమయంలో రోకలిబండతో తలపై కొట్టి చంపింది. అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story