బిగ్‌బాస్ హౌస్‌లో 'సుమ'‌.. భారీ ఆఫర్!!

బిగ్‌బాస్ హౌస్‌లో సుమ‌.. భారీ ఆఫర్!!

సుమ ఉన్న షో సూపర్‌గా ఉంటుంది. మరి బిగ్ బాస్ హౌస్‌లో వంద రోజులు సందడి చేస్తే.. ఫుల్లు ఎంటర్‌టైన్‌మెంట్. కోపాలు, తాపాలు, అలకలు లాంటివి ఏవీ లేకుండా హాయిగా నవ్వుకోవచ్చు. కానీ అలాంటి అవకాశం మీకు ఇవ్వనంటోంది సుమ. ఓన్లీ ఆ ఒక్క ఛానల్‌కే వంద రోజులు ఫిక్సయిపోతే ఎలానండీ.. పాపం మిగతా ఛానల్స్ వాళ్లు ఏమైపోతారు. అందుకే వాళ్లందరి కోసం భారీ పారితోషికాన్ని తిరస్కరించి బిగ్‌బాస్‌కి నో చెప్పినట్లు సమాచారం. గల గలా మాట్లాడే సుమకి స్టార్ మా నుంచి కాల్ వచ్చిందట. బిగ్‌బాస్ సీజన్-3లో కంటెస్టెంట్‌గా పాల్గొనమంటూ.. కానీ సుమ సున్నితంగా తిరస్కరించిందట. వివిధ ఛానల్స్‌లో షోలు మాత్రమే కాకుండా ఎన్నో సినిమా ఈవెంట్లకు ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తుంటుంది. మరి వంద రోజులు హౌస్‌లో బుక్కయిపోతే కష్టమని భావించిందట. అందుకే ఆఫర్‌కి నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇది తెలిసి సుమ ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. అయ్యో సుమక్క ఉంటే ఇల్లెంత బావుంటుంది. అటు ఇంట్లో వాళ్లని ఇటు ప్రేక్షకులను నవ్విస్తూ సందడి చేసేది అని ఫీలైపోతున్నారట. సుమ ఎంటరైతే కచ్చితంగా తనే విన్నర్ అయ్యేదని కూడా అంటున్నారు. కాగా, ఈ షో ఈ నెల 21 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story