భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ను జరిపి తీరుతాం : నిర్వాహకులు

భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ను జరిపి తీరుతాం : నిర్వాహకులు

మాంచెస్టర్‌లో జరుగుతున్న భారత్‌, కివీస్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 46.1 దగ్గర వర్షం ప్రారంభం కావడంతో... అంపైర్లు ఆట నిలిపేశారు. అయితే వర్షం ఎక్కువ సేపు కురిసే అవకాశం లేదన్నది వాతావరణ శాఖ అంచనా. 2 గంటల పాటు ఆటకు అంతరాయం వాటిల్లినా.. ఓవర్లలో కోత పెట్టకుండా మ్యాచ్‌ జరుపుతామని నిర్వాహకులు చెబుతున్నారు. ఒకవేళ మరీ ఇబ్బంది అయినా.. డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో భారత్‌ను 20 ఓవర్లు ఆడించైనా మ్యాచ్‌ పూర్తయ్యేలా చూస్తామన్నారు. మరీ అంత ఇబ్బందులు ఎదురైతే బుధవారం రిజర్వ్‌ డే రోజున ఆటను కొనసాగిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story