కర్ణాటకలో సిఎల్పీ సమావేశం.. రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం..
By - TV5 Telugu |9 July 2019 5:47 AM GMT
కర్నాటక సంక్షోభం నేపథ్యంలో సిఎల్పీ సమావేశం అయ్యింది. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజా సమావేశం ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ సహా ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ నేతృత్వంలో సిఎల్పీ భేటి జరుగుతోంది.
అటు సిఎల్పీ సమావేశానికి రెబల్ ఎమ్మెల్యేలు మగ్గురు హాజరయ్యారు. సౌమ్యారెడ్డి, మునిరత్న, బైరతి బసవరాజ్ లు ఈ సమావేశానికి వచ్చారు. డీకే శివకుమార్ జరిపిన చర్చలతో వారు దారికి వచ్చినట్టు తెలుస్తోంది. అటు ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్ కూడా అహ్మద్ పటేల్ తో సమావేశం అనంతరం తిరిగి కర్నాటక చేరుకున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com