ఇంటి పెరట్లోనే చేపల పెంపకం.. నెలకు 25వేల సంపాదన.. శిక్షణ పొందాలంటే..

ఇంటి పెరట్లోనే చేపల పెంపకం.. నెలకు 25వేల సంపాదన.. శిక్షణ పొందాలంటే..

ఇంట్లో కాస్త పెరడు ఉంటే మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. మందులు లేని కూరగాయల్ని పండిస్తూ ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటున్నారు. మొక్కలు పెంచుకున్నట్టుగానే చేపల పెంపకాన్ని కూడా ఇంటి పెరట్లో చేపట్టవచ్చంటున్నారు ఆక్వాకల్చర్ అధికారులు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయితీరాజ్ (ఎన్‌ఐఆర్డీపీఆర్) ఒక కొత్త తరహా ఆక్వాకల్చర్ విధానాన్ని పరిశీలిస్తోంది. కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు అభివృద్ధి చేసిన బ్యాక్‌చార్డ్ రీ-సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్. తక్కువ స్థలంలోనే చేపలను పెంచే పద్ధతి ఇది. ఈ పద్ధతి ద్వారా చేపల పెంపకానికి నీరు కూడా తక్కువగానే ఖర్చవుతుంది. నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు ఆర్థిక సహకారంతో.. ఎన్‌ఐఆర్డీపీఆర్‌లోని రూరల్ టెక్నాలజీ పార్క్‌లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారు. తిలాపియా, పాంగాసియస్, ముర్రెల్, పెరల్‌స్పాట్ రకం చేపలు ఈ పద్ధతిలో పెంపకానికి అనుకూలమని ఎన్‌ఐఆర్డీపీఆర్ అధికారులు తెలిపారు. జన్యుపరంగా మరింత అభివృద్ధి చేసిన తిలాపియా (గిప్ట్ రకం తిలాపియా చేపల) పెంపకాన్ని ఈ పద్ధతిలో చేపడితే నెలకు సగటున రూ.25,750 ఆదాయం వస్తుందని వారు వివరించారు. శిక్షణ పొందాలనుకునే ఔత్సాహిక యువతకు, రైతులకు, స్వయం సహాయక బృందాలకు హైద్రాబాద్ రాజేంద్రనగర్‌లోని శిక్షణ కార్యాలయం ఎన్‌ఐఆర్డీపీఆర్‌లో ఉన్న రూరల్ టెక్నాలజీ పార్క్‌లో వివరాలు తెలియజేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story