రాంప్రసాద్ కేసు మిస్టరీని ఛేదించిన హైదరాబాద్ పోలీసులు
క్రైమ్ సస్సెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తోన్న పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసు మిస్టరీని చేధించారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. విజయవాడకు చెందిన కోగంటి సత్యం..... ఈ హత్యకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందన్నారు పోలీసులు. ఈ మర్డర్‌లో మొత్తం 8 మంది హస్తం ఉందంటున్నారు పోలీసులు. వీరిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు కోసం గాలిస్తున్నారు
ఆరు నెలల కిందే రాంప్రసాద్ హత్యకు కోగంటి సత్యం స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. నెల క్రితం కోగంటి అనుచరుడు పంజాగుట్టలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. పక్కా ప్లాన్‌తో కోగంటి సత్యం డైరెక్షన్‌లోనే రాంప్రసాద్‌ను మర్డర్ చేశారు. ఇందుకోసం 30 లక్షల సుపారి ఇచ్చినట్లు తెలుస్తోంది. తన పాత్రను బయటపెట్టకుండా కోగంటి జాగ్రత్త పడ్డాడు.
కోగంటి వాడిన 5 సెల్ ఫోన్‌లను సీజ్ చేశారు పోలీసులు. ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాడిన బోలేరోను కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. అదుపులో ఉన్న వ్యక్తుల ఇచ్చిన వివరాల ఆధారంగా వాహనం, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ స్టీల్ వ్యాపారి బన్సల్ , హైదరాబాద్ కు చెందిన సియోట్ కంపెనీ ఓనర్లతో పాటు మరొకొంత మంది అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com