'సాయి' సహకారం.. స్కూల్‌ని దత్తత తీసుకున్న మెగా హీరో..

సాయి సహకారం.. స్కూల్‌ని దత్తత తీసుకున్న మెగా హీరో..

ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తిని అక్షరాలా నిజం చేస్తున్నారు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. మామూలు వ్యక్తులే ఎంతో కొంత తోటి వారికి సాయం చేస్తూ సేవాధృక్పథంలో ముందుంటే.. సెలబ్రిటీలం అయిన తాము కూడా ఎంతో కొంత సాయాన్ని అందిస్తే మనసుకి కాస్త ఊరటనిస్తుంది అని స్కూల్‌‌ని దత్తత తీసుకున్నారు. సాయి ధరమ్ ఇప్పటికే థింక్ పీస్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. అక్కడ ఉన్న కొంత మంది పిల్లల్ని దత్తత కూడా తీసుకున్నారు. ఇప్పుడు మున్నిగూడలోని అక్షరాలయ స్కూల్‌ని దత్తత తీసుకున్నారు.

మొత్తం 100 మంది విద్యార్థులకు రెండేళ్లపాటు చదువుకోవడానికి కావలసిన పుస్తకాలు, వారికి సరైన పోషకాహారం అందిస్తానని చెప్పారు. చిన్నారులను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. మీరు కూడా చేతనైనంత సాయం చేయండి అని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అక్షరాలయ స్కూల్ చిన్నారులు, నేను, థింక్ పీస్ ఆర్గనైజేషన్ అంతా మీ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోమని అంటున్నారు. ఈ ఏడాది మరో 50 మంది పిల్లలను దత్తత తీసుకుంటానని ఇన్‌స్టాలో తెలియజేశారు. విరాళాలు అందజేసే వారికోసం వెబ్ సైట్ లింక్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం సాయి ధరమ్ మారుతి డైరక్షన్లో 'ప్రతిరోజూ పండగే' అనే చిత్రంలో నటిస్తున్నారు. తేజూ సరసన హీరోయిన్‌గా రాశీ ఖన్నా నటిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story