పరారీలో ఉన్న కీచక టీచర్ అరెస్ట్

విద్యార్ధినిలను లైంగికంగా వేధించిన ప్రధానోపాధ్యాయుడు బెజవాడ శంకర్ రెడ్డిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు పోలీసులు. శంకర్ రెడ్డి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్. స్కూల్‌లో పదో తరగతి విద్యార్ధినిలను ఆఫీసుకు పిలిపించుకొని అసభ్యంగా ప్రవర్తించేవాడు. కొన్నాళ్లు అతని చేష్టల్ని భరించిన బాధితులు ఆ తర్వాత తల్లిదండ్రులకు చెప్పటంతో శంకర్ రెడ్డిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న శంకర్ రెడ్డి రోజుకో ప్రాంతం మారుతూ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. దీంతో అతని కదలికలపై నిఘా వేసి పట్టుకున్నారు.
హెడ్ మాస్టర్ శంకర్ రెడ్డి గతంలో కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటనలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. తిరుమలాయపాలెం మండలం తెట్టేలాపాడు గ్రామంలో విద్యార్ధినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తు పట్టుబడటంతో కేసు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

