టీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే 'సోమారపు' రాజీనామ

X
టీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజీనామా చేశారు. గడిచిన ఎన్నికల్లో రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాజీనామాపై మాట్లాడిన సత్యనారాయణ.. తన ఓటమికి ఎమ్మెల్యే బాల్క సుమన్, కొందరు నేతలు కారణమన్నారు. రాజకీయాల నుండి తప్పుకొంటున్నట్టు సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. అలాగే మేయర్ తీరుపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సోమారపు సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
