వరల్డ్ కప్ సెమీ ఫైనల్.. ఆ వికెట్ పడగొట్టగలిగితే మ్యాచ్ మనదే..!

మాంచెస్టర్ వేదికగా వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్‌లో టీమిండియా, న్యూజిలాండ్‌తో తలపడుతోంది. మాంచెస్టర్‌లో వర్షం పడేందుకు కొద్దిపాటి అవకాశాలున్నాయి. ఇప్పటికే వాతావరణం కాస్త మేఘావృతమై ఉంది. ఉదయం నుంచి పిచ్‌పై కవర్లు కప్పి ఉంచడంతో.. ఇన్నింగ్స్ మొదట్లో బౌలింగ్‌కు అనుకూలించే అవకాశాలున్నాయి. పరిస్థితులను సద్వినియోగం చేసుకుని.. బుమ్రా, షమీ, భువీ చెలరేగితే న్యూజిలాండ్‌కు కష్టాలు తప్పవనే చెప్పవచ్చు. ముఖ్యంగా జట్టుకు వెన్నెముకగా ఉన్న కేన్ విలియమ్సన్ వికెట్ పడగొట్టగలిగితే.. సగం మ్యాచ్ వశమైనట్లే అని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు టీమిండియా బ్యాట్స్‌మెన్ ఇప్పటికే చెలరేగుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఇప్పటికే 5 సెంచరీలు సాధించి వరల్డ్‌కప్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించారు. అలాగే ఒకే టోర్నీలో ఎక్కువ పరుగుల సచిన్ రికార్డును బద్దలు కొట్టేందుకు రోహిత్ కేవలం 27 పరుగులు మాత్రమే కావాలి. సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ ఈ మ్యాచ్‌లోనే సచిన్ రికార్డును బద్దలు కొడతాడన్న అంచనాలున్నాయి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com