సెమీఫైనల్‌.. మ్యాచ్ లో తొలి బంతికే ఉత్కంఠ

సెమీఫైనల్‌.. మ్యాచ్ లో తొలి బంతికే ఉత్కంఠ

భారీ అంచనాల మధ్య మొదలైన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో.. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నారు. మ్యాచ్‌లో తొలి బంతే ఉత్కంఠను రేపింది. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో తొలి బంతిని ఎదుర్కొన్న గప్తిల్‌.. వికెట్ల ముందు తడబడ్డాడు. బౌలర్‌ అప్పీల్‌ చేయగా అంపైర్‌ నాట్‌ అవుట్‌గా ప్రకటించాడు. అయితే టీమిండియా దీనిపై రివ్యూ కోరింది. బంతి లెగ్‌వికెట్‌కు దూరంగా వెళ్తున్నట్లు తేలడంతో.. భారత్‌ రివ్యూ కోల్పోయింది. తొలి బంతికే రివ్యూ కోల్పోవడం భారత్‌కు పెద్ద ఇబ్బందే అని చెప్పవచ్చు. ఇన్నింగ్‌లో ఏ ప్రతికూల నిర్ణయం వచ్చినా.. భారత్‌కు రివ్యూ కోరే అవకాశం లేకుండా పోయింది.

మరోవైపు.. భారత బౌలర్లు అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మొదటి రెండు ఓవర్లలో పరుగులేమీ రాలేదు. పేసర్లు భువనేశ్వర్‌, బుమ్రా టైట్‌ లైన్‌లో బంతులు వేయడంతో.. షాట్లు ఆడే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఒత్తిడికి గురైన గప్తిల్‌ బుమ్రా బౌలింగ్‌లో డ్రైవ్‌ చేయబోయి.. స్లిప్స్‌లో కోహ్లీ చేతికి చిక్కాడు. దీంతో న్యూజిలాండ్‌ తొలివికెట్‌ కోల్పోయింది.

Tags

Read MoreRead Less
Next Story