రోహిత్‌ శర్మ ముంగిట మరో అరుదైన రికార్డు

రోహిత్‌ శర్మ ముంగిట మరో అరుదైన రికార్డు

వరల్డ్‌కప్‌లో శివమెత్తినట్లు బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటికే 5 సెంచరీలు సాధించి... ఒకే టోర్నీలో ఎక్కువ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన రోహిత్‌... తాజాగా సచిన్‌ రికార్డుపై కన్నేశాడు. ఒకే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డును రోహిత్‌ ఇదే మ్యాచ్‌లో అధిగమించే అవకాశాలున్నాయి. ఇప్పటికే 647 పరుగులు చేసిన రోహిత్‌.. మరో 27 పరుగురు చేస్తే... సచిన్‌ 673 పరుగుల మైలురాయిని అధిగమిస్తాడు. 2003 వరల్డ్‌కప్‌లో సచిన్‌ నెలకొల్పిన ఈ రికార్డును... 2019 వరల్డ్‌కప్‌లో మరో భారతీయుడే బద్దలు కొట్టే అవకాశాలుండడం.. టీమిండియా ఫ్యాన్స్‌కు ఆనందాన్నిస్తోంది.

Tags

Next Story