లైవ్‌లో వార్తలు చదువుతుంటే భూకంపం.. భయంతో యాంకర్..

వర్షాలు జోరున కురుస్తున్నాయని వార్తలు చెప్పొచ్చు. నగరం తడిచి ముద్దవుతోందని తడవకుండానే చెప్పొచ్చు. నిన్న వచ్చిన భూకంపం గురించి, భూకంప తీవ్రత రిక్టార్ స్కేలుపై ఎంత నమోదైంది జనాలకు వివరించొచ్చు. మరి లైవ్‌లో ఇద్దరు యాంకర్లు స్టూడియోలో వార్తలు చదువుతుండగానే భూమి కంపించి.. భూకంపం వస్తే.. వెన్నులో వణుకు వచ్చింది ఆ యాంకర్‌కి. ఇటీవల కాలిఫోర్నియా, నెవాడా, మెక్సికోలో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇద్దరు న్యూస్ యాంకర్లు కేసీఏఎల్ టీవీ చానెల్‌లో వార్తలు చదువుతున్నారు. అంతలో ఈ ఘటన సంభవించింది. అంతే పక్కనే ఉన్న మేల్ యాంకరైనా అలాగే వణుకుతూ వార్తలు అందించారు కానీ ఫిమేల్ యాంకర్ మాత్రం బాబోయ్ భూకంపం వచ్చింది. నేను టేబుల్ కింద దాక్కుంటున్నాను అని లైవ్‌లో చెప్పేసి టేబుల్ కిందకి దూరింది. ఈ వీడియోను అమెరికా జర్నలిస్ట్ అన్నా మెర్లాన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటికే ఆరు లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.
I am absolutely Team Climb Under the Goddamn Desk pic.twitter.com/eU1cR5Dbr0
— Anna Merlan (@annamerlan) July 6, 2019
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com