మరోసారి భారతదేశంపై విషం చిమ్మిన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా!

ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా మరోసారి భారతదేశంపై విషం చిమ్మింది. భారత సైన్యంపై దాడులు చేయా లని ఉగ్రవాదులకు అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి పిలుపునిచ్చాడు. కశ్మీర్‌లో ఉన్న టెర్రరిస్టులను ఉద్దే శించి మాట్లాడిన జవ హరి, కశ్మీర్ ప్రభుత్వం-భారత సైన్యంపై దాడులు చేయడమే లక్ష్యంగా జిహాదీలు ముందుకు వెళ్లాలని రెచ్చగొట్టాడు. ఆర్మీపై దాడులతో భారత ఆర్థిక వ్యవస్థను బలహీనపరచాలని ప్రేరేపించాడు. మానవశక్తి-సాంకేతిక శక్తిలో భారత్‌ను కోలుకోలేని దెబ్బతీయాలని ఉద్బోధించాడు. కశ్మీర్‌లో జరుగుతున్న పోరు వేర్పాటువాద సమస్య కాదన్న జవహరి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శక్తులపై ముస్లింలు చేపట్టిన జిహాదీ పోరాటంగా అభివర్ణించాడు.
జవహరి వీడియో దాదాపు 14 నిమిషాల నిడివితో ఉంది. అందులో కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. భారత సైన్యంపై జిహాదీ పోరాటం చేయడానికి అవసరమైన గ్రూప్‌ను అల్ ఖైదా తయారు చేస్తున్నట్లు సమాచారం. కశ్మీర్ వేర్పాటువాదాన్ని మరింత రెచ్చగొట్టి, జిహాదీ పోరాటాలతో లోయలో అస్తిరత సృష్టించడమే లక్ష్యంగా అల్ ఖైదా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. అల్ ఖైదా భారత విభాగాన్ని జకీర్ మూసా ప్రారంభించాడు. ఐతే, అతని గురించి జవహరి తన ప్రసంగంలో ప్రస్తావించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com