అద్భుతం జరిగితే తప్ప భారత్‌ గెలిచే అవకాశాలు తక్కువే..

అద్భుతం జరిగితే తప్ప భారత్‌ గెలిచే అవకాశాలు తక్కువే..

మాంచెస్టర్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ లో భారత్‌ విజయం కోసం ఎదురీదుతోంది. అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిచే పరిస్థితులు కనిపించడం లేదు. 240 పరుగుల టార్గెట్‌ ను చేధించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 5 పరుగులకే టాప్‌ ఆర్డర్‌ను కోల్పోయింది. ఆ తర్వాత దినేష్‌ కార్తీక్‌ ఆశలు రేకెత్తించి ఉసూరుమనిపించాడు. ఈ దశలో హార్దిక్‌ పాండ్యా, రిషత్‌ పంత్‌ జోడీ కాస్త నిలదొక్కుకుంది. జాగ్రత్తగా ఆడుతూ.. అడపాదడపా బౌండరీలు సాధిస్తూ.. ఇద్దరూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. అయితే అనవసర షాట్లకు పోయి ఇద్దరూ వికెట్లు చేజార్చుకోవడంతో... మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది.

6 వికెట్లు కోల్పోయిన భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే.. ధోనీ, జడేజా జోడీ అత్యద్భుతంగా ఆడి తీరాల్సిందే. ప్రస్తుతం పిచ్‌ స్పందిస్తున్న తీరును బట్టి ఇది అత్యాశే అవుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఏదైనా సంచనలం జరిగితే తప్ప భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌ కు చేరే అవకాశాలు కనిపించడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story