హైపర్ ఆది తనపై వేసే పంచులకు శాంతి స్వరూప్..

జబర్దస్త్ కామెడీ షో విజయవంతంగా రన్ అవుతుంటుంది. ఈ షో ద్వారా ఎన్నో కుటుంబాలకు జీవనాధారం దొరికింది. కొందరు ఆర్టిస్టులు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. షోలోని ఆర్టిస్టులు వేసే పంచులకు బుల్లి తెర ప్రేక్షకులకు బోలెడంత వినోదం. ఇందులోని ఆర్టిస్టులంతా ఓ కుటుంబంలా ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతారు. ఇక లేడీ గెటప్పులు వేసే శాంతి స్వరూప్ ఆది టీమ్‌లోను, అవినాశ్ టీమ్‌లోనూ పని చేస్తుంటాడు. ఆదీ వేసే పంచులకు నీకు బాధ కలగదా అని.. నీ పర్సనాలిటీని టార్గెట్ చేస్తుంటాడు కదా అని ఎక్కడికి వెళ్లినా జనం అడుగుతుంటారు. దానికి శాంతి స్వరూప్.. స్కిట్ బాగా రావాలని చూస్తాం.. ప్రేక్షకులను నవ్వించడానికి కష్టపడుతుంటాం. అంతే కానీ అందులో బాధపడే అంశాలు ఏవీ వుండవు. అవన్నీ సరదాగా చేసినవే కానీ.. సీరియస్‌గా తీసుకోవలసింది ఏదీ ఉండదు అని చెప్పుకొచ్చాడు. అయినా ఆది నాపై ఎన్ని పంచ్‌లు వేస్తే నేను అంత హ్యాపీగా ఫీలవుతా.. మరి వాటి ద్వారానే కదా నాకు జబర్దస్త్‌లో గుర్తింపు వచ్చింది అని ఆనందంగా చెబుతాడు శాంతి స్వరూప్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com