సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ. 7 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఈ పరిహారం బాధిత కుటుంబానికి మాత్రమే చేరేలా ఒక చట్టాన్ని కూడా తీసుకు వస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ పరామర్శించాలని సూచించారు.

ఇక గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారంపై అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 2014 నుంచి 2019 మధ్య 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని డిస్ట్రిక్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో రికార్డులు చెప్తున్నాయి.. కానీ 391 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినట్టుగా రికార్డులు చెప్తున్నాయని దీనిని సమీక్షించాల్సించిగా జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Tags

Next Story