బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

రేపటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు హాజరయ్యారు.. రాష్ర్టంలో నెలకొన్న కరవు పరిస్థితులు, విత్తనాల సమస్యపై చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు.. టీడీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను కూడా సభలో ప్రస్తావించాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలకు జరిగిన పరాభవంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

Tags

Next Story