ఆ జోడీ రాణించడంపైనే భారత్‌‌కు విజయావకాశాలు ఆధారం

ఆ జోడీ రాణించడంపైనే భారత్‌‌కు విజయావకాశాలు ఆధారం

మాంచెస్టర్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ విజయం కోసం ఎదురీదుతోంది. 5 పరుగులకే టాప్‌ ఆర్డర్‌ను కోల్పోయిన భారత్‌ను.. రిషబ్‌ పంత్‌, దినేష్‌ కార్తీక్‌ కాసేపు ఆదుకున్నారు. ఆ తర్వాత కార్తీక్‌ కూడా అవుట్‌ కావడంతో భారత్ పీకల్లోకు కష్టాల్లో కూరుకుపోయింది. పంత్‌కు జోడీగా పాండ్యా ఆడుతున్నాడు. వీరిద్దరూ కుదురుకుని... మ్యాచ్‌ 50 ఓవర్ల వరకు జరిగితే.. తప్ప భారత్‌కు ఈ మ్యాచ్‌లో విజయావకాశాలు లేవనే చెప్పాలి.

వర్షం కారణంగా మాంచెస్టర్‌ పిచ్‌ ఆది నుంచే బౌలర్లకు సహకరిస్తోంది. ముఖ్యంగా సీమ్‌ బౌలర్లు ట్రెంట్‌ బౌల్ట్‌, హెన్రీ, ఫెర్గూసన్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులకు గురిచేశారు. షార్ప్‌ స్వింగ్‌ ను ఆడడంలో ఉన్న బలహీనతను మరోసారి మన బ్యాట్స్‌మెన్‌ బయటపెట్టుకున్నారు. మిగతా పిచ్‌లపై ఆడినట్లు షాట్లు ఆడేందుకు ప్రయత్నించడంతో... వికెట్లు టపటపా పడిపోయాయి. అయితే మ్యాచ్‌ గడుస్తున్న కొద్దీ.. పిచ్‌తో పాటు, అవుట్‌ఫీల్డ్‌ కూడా ఆరుతుండడంతో బ్యాటింగ్‌ కాస్త సులువవుతోంది. ధోనీ, జడేజా ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉన్నందున.. ప్రణాళిక ప్రకారం ఆడితే మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

Tags

Next Story