నోరు జారిన మంత్రి అనిల్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా మొదలయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది తెలుగుదేశం. అయితే దీన్ని స్పీకర్ తిరస్కరించారు. ప్రతిపక్షం కావాలనే రాద్దాంతం చేస్తోందని ప్రభుత్వం విమర్శించింది. ఆ తర్వాత బీఏసీలో నిర్ణయించినట్లుగా ముందుగా ప్రశ్నోత్తరాలు చేపట్టారు.
ఆర్ అండ్ బీ శాఖకు సంబంధించిన ప్రశ్నలను తెలుగుదేశం సభ్యులు లేవనెత్తారు. దీనికి మంత్రి ధర్మాన కృష్ణదాస్ సమాధానం ఇచ్చారు. అయితే గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన పనులను ... ఎక్కువకాలం పెండింగ్ లో ఉంచకుండా త్వరగా పూర్తిచేయాలని కోరారు టీడీపీ నేత అచ్చెంనాయుడు.
పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నోరు జారారు. పోలవరంపై రెండు లిఫ్ట్ లు ఏర్పాటు చేసి 400కోట్లు దోబ్బేశారని విమర్శించారు. దీనిపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు మంత్రి అనిల్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com