ప్రేమ వివాహం.. యువతి కిడ్నాప్ కేసులో పురోగతి

భువనగిరి పట్టణంలో మహిళ కిడ్నాప్ కేసు కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. బుధవారం ఇన్నోవా కారులో వచ్చిన దుండగులు భావనను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన జగదేవపూర్ చౌరస్తాలో చోటు చేసుకుంది.
కొద్దిరోజుల కిందట భావన, భానుచందర్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. గత శుక్రవారం బొమ్మలరామారం పీఎస్‌లో వీరికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. భాను చందర్ స్వగ్రామం బీబీ నగర్ మండలం కొండమడుగు కాగా.. భావన స్వస్థలం బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి. ఐతే.. వీరి ప్రేమ వివాహాన్ని ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతోనే ఈ కిడ్నాప్ జరిగినట్టు తెలియడంతో.. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. నిన్న సాయంత్రం నుంచి భువనగిరి పట్టణంలోని సీసీ ఫుటేజ్ అంతా పరిశీలించి.. ఇన్నోవా కారు ఎటు వెళ్లింది.. ఆమెను ఎక్కడికి తీసుకెళ్లారనేది రాబట్టారు. అమ్మాయి మేనమామతోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

