ఆ స్థానంలో ధోని బ్యాటింగ్‌కు వస్తే ఫలితం మరోలా ఉండేది : సచిన్

By - TV5 Telugu |11 July 2019 1:18 AM GMT
టీమిండియా సెమీస్‌లోనే ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. అయితే ఐదో స్థానంలో హార్దిక్ పాండ్యా బదులు ధోని బ్యాటింగ్‌కు రావాల్సింది. ధోని ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసుంటే ఫలితం మరోలా ఉండేదని అన్నారు.. ఈ విషయంలో మేనేజ్‌మెంట్ పొరపాటు చేసిందని బావిస్తునట్లు పేర్కొన్నాడు సచిన్. న్యూజిలాండ్‌తో చివరిదాకా పోరాడిన టీమిండియా చివరకు ఓటమి పాలవడం తనకు నిరాశ కలిగించిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ . కానీ.. విజయం కోసం భారత్ చివరివరకూ పోరాడి తన స్ఫూర్తిని ప్రదర్శించిందని అన్నారు . ప్రపంచకప్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత్ ఆకట్టుకుందని ఆయన గుర్తుచేసుకున్నారు మోదీ.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com