తక్కువ ధరకే సెల్ ఫోన్.. ఆన్‌లైన్ మోసం
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆన్‌లైన్ మోసం వెలుగు చూసింది. తక్కువ ధరకే సెల్ ఫోన్ పంపిస్తామని కేటుగాళ్లు ఓ వ్యక్తిని బురిడీ కొట్టించారు. నక్కబండకు చెందిన సుహెల్‌కు MI-5 సెల్ ఫోన్ తక్కువ ధరకే ఇస్తామని కాల్ వచ్చింది. 7 వేల 5 వందల రూపాయల ఫోన్.. కేవలం 4 వేల 500 చెల్లిస్తే పోస్టల్ ద్వారా పంపుతామన్నారు కేటుగాళ్లు. ఇది నమ్మిన సుహెల్ డబ్బులు చెల్లించడానికి అంగీకరించాడు. తనకు వచ్చిన పార్సిల్‌ను 4 వేల 500 రూపాయలు చెల్లించి తీసుకున్నాడు. అయితే పార్సిల్ విప్పి చూడగా ఒక పర్స్, బెల్ట్ మాత్రమే ఉన్నాయి. వాటి విలువ 200 రూపాయలకు మించి ఉండదు. మోసపోయానని గ్రహించిన సోహెల్ తనకు వచ్చిన ఫోన్ కాల్ చేశాడు. అయితే ఆ నంబర్ బిజీ బిజీ అని వచ్చింది. ఆన్ లైన్ కేటుగాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు సోహెల్.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com