బిగ్ బాస్‌‌పై బాంబ్ పేల్చిన శ్వేతారెడ్డి

బిగ్ బాస్‌‌పై బాంబ్ పేల్చిన శ్వేతారెడ్డి

టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన కమిట్మెంట్ కల్చర్ ఇప్పుడు బిగ్ బాస్ త్రీలో దుమారం రేపుతోంది. కంటెస్టెంట్ల ఎంపిక పై ఉత్కంఠ కొనసాగుతుండగానే కమిట్మెంట్ కల్చర్ కాంట్రవర్సీ చెలరేగింది. కమిట్మెంట్ ఇస్తేనే బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తారా? అని బాంబ్ పేల్చారు శ్వేతారెడ్డి. మిమ్మల్ని ఎంపిక చేస్తే మాకేంటీ అంటూ ప్రశ్నిస్తున్నారని..కమిట్మెంట్ ఇస్తే లైన్ క్లియర్ చేసే ధోరణిలో ఎంపిక జరుగుతోందని బిగ్ బాస్ త్రీపై సంచలన ఆరోపణలు చేశారామె.

షోను రక్తి కట్టించేందుకు పాపులర్ పర్సనాలిటీలతో పాటు సోషల్ మీడియాలో పాపులర్ అయినవారికి కూడా బిగ్ బాస్ హౌజ్ లోకి అవకాశం కల్పిస్తారు. బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ తో కంటెస్టెంట్లకు మరింత పాపులారిటీ పెరిగే అవకాశాలు ఉంటాయి. దీంతో సాధారణంగానే హౌజ్ లోకి ఎంట్రీ దొరికితే జాక్ పాట్ తగిలినట్టే అని భావించే వారు కూడా ఉంటారు. ఈ క్రేజ్ నే బిగ్ బాస్ కో-ఆర్డినేటర్లు, ప్రొడ్యూసర్లు క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ హౌజ్ మేట్స్ ఎంపికలో కమిట్మెంట్ కల్చర్ నడుస్తుందని ఆరోపిస్తున్న శ్వేతారెడ్డి గతంలో న్యూస్ రీడర్ గా పనిచేశారు. గత ఎలక్షన్స్ సమయంలో పాల్ తో జరిగిన గొడవతో ఆమెకు సోషల్ మీడియాలో గుర్తింపు పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను బిగ్ బాస్ త్రీ టీం తనను అప్రోచ్ అయినట్లు ఆమె చెబుతున్నారు. కో-ఆర్డినేటర్ రవికాంత్ పాల్గొనమని అడగటంతో సెలక్షన్స్ కి వెళ్లి సెలక్ట్ అయ్యాయని చెబుతోంది శ్వేతారెడ్డి. బిగ్ బాస్ హెడ్ అభిషేక్ కూడా తనను హౌజ్ మేట్ గా ఉండాలని కోరినట్లు అంటోంది.

అయితే..అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం చేయించిన కో-ఆర్డినేటర్ రవికాంత్ పలుమార్లు సమావేశాలు నిర్వహించారని అన్నారు శ్వేతారెడ్డి. ఓ రెస్టారెంట్ లో పదే పదే సమావేశాలు నిర్వహించటం...తోడుగా వచ్చిన వారిని దూరంగా కూర్చోబెట్టడం చేస్తుండేవాడని వివరించారు. ఓ శ్యామ్ అనే ప్రొడ్యూసర్ వచ్చి మిమ్మల్ని ఎందుకు సెలక్ట్ చేయాలి? మా బాస్ ని ఇంప్రెస్ చేయండి అంటూ అడిగాడని అంటున్నారామె. అంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాలని అడుగుతున్నారా అంటూ సంచలన ఆరోపణలు చేశారామె.

Tags

Read MoreRead Less
Next Story