కర్నూలు జిల్లాలో భగ్గుమన్న పాత కక్షలు.. టీడీపీ నేతపై..

కర్నూలు జిల్లాలో భగ్గుమన్న పాత కక్షలు.. టీడీపీ నేతపై..

ఏపీలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. కొలిమిగుండ్ల మండలం గొర్విమాన్‌ పల్లెలో అర్థరాత్రి టీడీపీ నేత మైనింగ్‌ ఓనర్‌ రమేశ్వర రెడ్డి వాహనంపై వైసీపీ వర్గీయులు రాళ్లదాడి చేశారు. బనగానపల్లె నుంచి తాడిపత్రికి వెళుతుండా వాహనాలపై రాళ్లురువ్వారు. ఈ దాడిలో పలువురికి గాయాలవగా రామేశ్వర రెడ్డి వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. తాజా దాడులతో గొర్విమాన్ పలెల్లో ఉధ్రిక్త వాతావరణం నెలకొంది. దాడి ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో పోలీసుల పహారా కొనసాగుతోంది.

Tags

Next Story