విజయసాయిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని రాష్ట్రపతికి లేఖ రాసిన టీడీపీ

విజయసాయిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని రాష్ట్రపతికి లేఖ రాసిన టీడీపీ

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని రాష్ట్రపతికి లేఖ రాసింది టీడీపీ. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ లాభదాయక పదవిలో ఆయన కొనసాగరంటూ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి కూడా ఫిర్యాదు కాపీని పంపించింది. కాగా, విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక ప్రజాప్రతినిధి లాభదాయక పదవిలో కొనసాగితే ఆ సభ్యుడిపై అనర్హత వేటు వేసే అధికారం సభాధ్యక్షుడికి ఉంటుందని టీడీపీ చెబుతోంది.

Tags

Next Story