చేప కోసం గాలం వేస్తే.. భయంకరమైన పాము..
టెక్సాస్లోని హౌస్టన్, లూసియానా ప్రజలకు చేపలు పట్టడం హాబీ. ఓ యువకుడు రోజులానే ఆ రోజు కూడా ఉదయాన్నే గాలం తీసుకుని చేపలు పట్టడానికని సరస్సు దగ్గరకు వెళ్లాడు. గాలం తీసుకుని సరస్సులో వేశాడు. కొద్దిసేపటికి గాలం బరువుగా అనిపించడంతో పెద్ద చేప ఏదో చిక్కుకుని ఉంటుందనుకుని పైకి లాగాడు. తీరా చూస్తే ఓ పేద్ద పాము దాని నోట్లో ఓ చేప గిల గిలా కొట్టుకుంటోంది. దాన్ని చూడగానే ఏ ఎక్స్ప్రెషనూ లేదు అతడి ముఖంలో. ఈ వీడియోను టెక్సాస్ వైల్డ్ బాయ్ అనే ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గేలానికి పాము చిక్కుకున్నా అతడు చాలా ధైర్యంగా ఉన్నాడని, అదే తామైతే పాముని చూడగానే భయంతో పరుగులు పెట్టేవారమని కామెంట్ చేస్తున్నారు. ఆ తరువాత ఏం చేశావ్ అని కొందరంటే.. నీ ఎక్స్ప్రెషన్ సూపర్ బాస్ అంటూ మరికొందరు.. నీ కోసమే ఆ చేపను పాము పట్టుకొచ్చింది అని కొందరు.. ఎవరు ముందు కదులుతారు.. చేపా.. పామా అని ఇలా బోలెడు కామెంట్లు పెడుతున్నారు.
The things I go through with bayou fishing ???????????????? pic.twitter.com/5E5qqg6Ira
— TEXAS WILD BOY???????? (@ChaseThePlayBoy) July 8, 2019
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com