వైసీపీ సర్కారు తొలి బడ్జెట్‌.. కేటాయింపులపై సర్వత్రా ఆసక్తి

వైసీపీ సర్కారు తొలి బడ్జెట్‌.. కేటాయింపులపై సర్వత్రా ఆసక్తి

వైసీపీ సర్కారు తొలి బడ్జెట్‌ను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా బడ్జెట్‌ రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా నవరత్నాలపై ఎక్కవ ఫోకస్‌ చేశారు సీఎం జగన్‌. ఈ ఉదయం 11 గంటలకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌... 2019-20 బడ్జెట్‌ను. సభ ముందు పెట్టనున్నారు. ఓ వైపు భారీగా అప్పులు, మరోవైపు ఆర్ధిక లోటు నేపథ్యంలో...ఈ బడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉంటాయన్ని ఆసక్తిగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఇవాళ బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతోంది వైసీపీ సర్కారు. గతంలో లక్షకోట్ల బడ్జెట్‌ను దాటించి వైఎస్సార్ ఓ అరుదైన రికార్డు సాధిస్తే... ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి‌ సైతం... మరో అరుదైన మైలురాయిని అధిగమిస్తున్నారు. దాదాపు రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ అరుదైన మైలురాయిని దాటే అవకాశం ఈసారి ఆర్థికమంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ కి దక్కింది. గత టీడీపీ ప్రభుత్వం.... ఓట్ ఆన్ అకౌంట్ పేరుతో 2.26 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టినా.. ఇప్పుడు 2019-20 పూర్తిస్థాయి బడ్జెట్ ని ప్రవేశపెడుతోంది వైసీపీ సర్కారు.

ఈ ఉదయం 11 గంటలకు.... ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.... సభలో వైసీపీ ప్రభుత్వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తొలి బడ్జెట్ కావడంతో ... భారీ కసరత్తు చేశారు. ఇటీవలే ఈ బడ్జెట్‌కు తుదిమెరుగులు దిద్దారు సీఎం జగన్‌. కేటాయింపులపై జరిగిన కసరత్తులన్నీ కొలిక్కి వచ్చాయి. తమ మేనిఫెస్టోలో చెప్పినట్లు.... వైఎస్సాఆర్‌ రైతు భరోసా, ఆరోగ్యశ్రీ,, వైఎస్సాఆర్‌ చేయూత, పించన్ల పెంపు, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, పేదలందరికీ ఇళ్లు, వైఎస్‌ఆర్ జలయజ్ఞం, యువత - ఉపాధి, వైఎస్సార్‌ ఆసరా పథకం, అమ్మ ఒడి, మధ్యపాన నిషేధం వంటి ఈ తొమ్మిది సంక్షేమపథకాలపైనే ప్రధానంగా దృష్టిపెట్టారు. ఎన్నిక సమయంలో ఇచ్చిన ఈ హామీలన్నీ నెరవేర్చే దిశగా.... బడ్జెట్‌ రూపొందించినట్లు తెలుస్తోంది. నవరత్నాలకు అధిక ప్రాధాన్యమిస్తూనే, దుబారాని పూర్తిగా తగ్గిస్తూ బడ్జెట్ తయారు చేశారు..... spot with music

మరోవైపు... వ్యవసాయ బడ్జెట్‌ను సైతం సభముందుకు తేనున్నారు. వ్యవసాయబడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సభలో ప్రవేశపెడతారు. ఇప్పటికే 66 వేల కోట్ల రూపాయల లోటులో ఉంది రాష్ట్రం. మరోవైపు 3 లక్షల 62 కోట్ల రూపాయలు అప్పు ఉంది. దీనికి తోడు కొత్త పథకాలు, పెంచిన జీతాలతో.. ఆర్ధికమంత్రిపై విపరీతమైన ఒత్తిడి ఉంది. మరోవైపు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఏపీకి కొత్తగా ఎలాంటి నిధులనూ కేటాయించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సొంతంగా నిధులను ఎలా సమీకరిస్తారనేది ఆసక్తిగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story