ఆటో డ్రైవర్ షర్టు విప్పి నడి రోడ్డుపై..
By - TV5 Telugu |12 July 2019 11:01 AM GMT
ప్రకాశం జిల్లా మార్టూరులో మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్ వీరంగం సృష్టించాడు. పీకల దాకా మద్యం సేవించి.. షర్టు విప్పి నడి రోడ్డుపై హడావుడి చేశాడు. రహదారిపై వచ్చే వాహనాలను ఆపుతూ అందరినీ భయబ్రాంతులకు గురిచేశాడు. తన ఒంటిపై గాయాలు చేసుకుని బస్సులను ఆపే ప్రయత్నం చేశాడు. అతడ్ని ఆపేందుకు వచ్చిన పోలీసులను సైతం లెక్క చేయకుండా హల్చల్ చేశాడు. కొన్ని గంటల పాటు హడావుడి తరువాత స్థానికుల సాయంతో పోలీసులు ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com