కీచక అధ్యాపకులు.. మార్కుల ఆశ చూపి విద్యార్థులను లోబరుచుకున్నారు
విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దాల్సిన అధ్యాపకులే కీచకులుగా మారారు. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థినిల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈఘటన చదవుల తల్లి నిలయమైన బాసర ట్రిపుల్ ఐటీలో తీవ్రకలకలం రేపుతోంది. లైంగిక వేధింపుల కేసులలో ఏకంగా ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు కటకలాల పాలైయ్యారు..
ఉన్నత ఆశయాలతో బాసర ట్రిపుల్ ఐటీలో అడుగుపెట్టిన విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విషనాగుల్లా తయారయ్యారు ఆధ్యాపకులు. విద్యాబుద్ధులు నేర్పి పిల్లలను మంచి మార్గంలో నడించాల్సిన అధ్యాపకులే గాడి తప్పి రాసలీలలతో కీచక పర్వాన్ని సాగిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినులపై అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు సాగించిన లైంగిక దాడులు సంచలనం రేపుతున్నాయి. విద్యార్థులు, ప్రజాసంఘాల ఆందోళన ఫిర్యాదులతో చివరకు కటకటాల పాలైయ్యారు ముగ్గురు కీచక అధ్యాపకులు.
అధ్యాపక వృతికే కలంకం తెచ్చారు ముగ్గురు ప్రొఫెసర్లు . బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే బాసర ట్రిపుల్ లో ఇటీవల కెమిస్ట్రీ విభాగాధిపతి రవి కటకటాల పాలైయ్యాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న విశ్వనాథ్, సుధాకర్‌లను లైంగిక వేధింపుల కేసులో తాజాగా అరెస్ట్ అయ్యారు. వీరిపై నిర్భయ, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మార్కులను ఆశ చూపి అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. .
గత కొంత కాలంగా పాస్ మార్కులు వేయిస్తానని ఆశ చూపి.. బాలికలపై అత్యాచారానికి తెగబడ్డాడు ప్రొఫెసర్ రవి. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులే టార్గెట్‌గా తన అరాచకాలకు తెరలేపాడు. అంతే కాదు తన లైంగిక కోరిక తీర్చిన విద్యార్థినిలకు పేపర్ లీక్ చేయడంతో పాటు ఇంట్లోనే పరీక్షలు నిర్వహించేవాడు. ఇంట్లో వారిని బయటకు పంపించి అక్కడే విద్యార్థునిలపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో బాధిత విద్యార్థులు ఉన్నట్లు తేలడం కలకలం రేపుతోంది.
దీనిపై నిజనిర్ధారణ కమిటీ వేసి విచారణ చేస్తున్న అధికారులు.. అసిస్టెంట్ ప్రొఫెసర్లు రవి, విశ్వనాథ్, సుధాకర్‌లను సస్పెండ్ చేశారు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. బయటకు చెబితే ఎక్కడ కెరీర్ నాశనం అవుతుందోననే భయంతో... ఇనాళ్లు అసిస్టెంట్ ఫ్రొఫెసర్ల చేష్టలను మౌనంగా భరించారు విద్యార్థినిలు. గతంలోనూ ఓ అధ్యాపకుడు చేసిన నిర్వాకానికి ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. మొత్తం ఇప్ప టి వరకు ఏడుగురు విద్యార్థులు వివిధ కారణాల తో ఇక్కడి క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com