ధోనీ రిటైర్మెంట్ నిర్ణయం ఆమెకు..

ధోనీ రిటైర్మెంట్  నిర్ణయం ఆమెకు..

మహేంద్ర సింగ్ ధోని అంటే క్రికెట్ అభిమానులకు ప్రత్యేక అభిమానం. ఏ మాత్రం టెన్షన్ లేకుండా ఎప్పుడూ కూల్‌గా ఉండే మహి అంటే మనసు పారేసుకునేవారు ఎందరో. మహీ రిటైర్మెంట్ వార్తలను ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పడే ఆ నిర్ణయం తీసుకోవద్దు అంటూ అభిమానులు కోరుతున్నారు. మరి మహి మనసులో ఏముందో.. ఫ్రపంచకప్‌ ఫైనల్స్‌కి వెళతుందనుకున్న టీమిండియా కివీస్ చేతిలో ఓడిపోయి వెనుదిరగాల్సి వచ్చింది. ఒకవేళ ధోని రిటైర్మెంట్ తీసుకుంటే ఓటమితో వెళ్లకూడదనేది అభిమానుల ఆశ. ఈ ఒక్కసారికి నీ ఆలోచనను విరమించుకో అంటూ కోట్లాది మంది అభిమానులతో పాటు బాలీవుడ్ కోకిల.. లతా మంగేష్కర్ కూడా కోరుకుంటున్నారు.

న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ధోనీ చాలా నిదానంగా ఆడడంతో పాటు అతడు రనౌట్ అవడం భారత్ ఓటమికి ప్రధాన కారణమంటూ విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మహీ కచ్చితంగా ఆటకు గుడ్‌బై చెబుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ధోనీ అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే బావుండని అనుకుంటున్నారు. లతాజీ కూడా.. ధోనీ మీ నిర్ణయాన్ని మార్చుకోండి అని అంటున్నారు. దేశానికి మీలాంటి క్రీడాకారులు ఎంతో అవసరం అని అంటున్నారు. అప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచించవద్దని కోరుతున్నా అంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story