రైతులపై మోదీ ప్రభుత్వానిది కపట ప్రేమ: కాంగ్రెస్

రైతులపై మోదీ ప్రభుత్వానిది కపట ప్రేమ: కాంగ్రెస్

వ్యవసాయ రంగ సంక్షోభంపై పార్లమెంటులో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య మాట యుద్ధం జరిగింది. రైతుల ధీన స్థితికి మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు విమర్శలు కుప్పించుకున్నారు. పారిశ్రామికవేత్తలకు మాత్రం లక్షల కోట్ల రుణమాపీ చేసిన కేంద్రం రైతన్న గురించి పట్టించుకోవడంలేదని రాహుల్ ఆరోపించారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పాలకుల వైఖరి వలనే రైతుల ఆత్మహత్యకు కారణమని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు.

దేశంలో వ్యవసాయ రంగ సంక్షోభంపై లోక్‌సభ దద్దరిల్లింది.లోక్‌సభలో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. రైతుల పరిస్థితులు ఘోరంగా ఉన్నాయంటూ కేంద్రంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రైతుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. లోక్‌సభలో జీరోఅవర్‌ లో మాట్లాడిన ఆయన… రైతులపై మోదీ ప్రభుత్వం కపటప్రేమ చూపుతుందంటూ మండిపడ్డారు.

రుణం తీర్చలేక వయనాడ్‌లో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని సభ దృష్టికి తీసుకువచ్చారు రాహుల్ . రుణం తీర్చనందుకు 8వేల మంది రైతులకు బ్యాంకులు నోటీసులు ఇచ్చాయని గుర్తు చేశారు రైతులకు కేవలం రూ 4.3 లక్షల కోట్ల పన్ను మినహాయింపులు ఇచ్చిన కేంద్రం సంపన్న పారిశ్రామికవేత్తలకు మాత్రం రూ 5.5 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందన్నారు. రుణాల వసూలు కోసం బ్యాంకులు రైతులను బెదిరించకుండా కేంద్రం, రిజర్వు బ్యాంకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాహుల్‌.

రాహుల్ గాంధీ ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చింది కేంద్రం . దశాబ్దాలుగా కాంగ్రెస్ పాలకులు అనుసరించిన విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ ఎదురు దాడి చేశారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌.సింగ్‌. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా మోదీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారాయన. రైతుల సమస్యలపై పార్లమెంట్ దద్దరిల్లింది. రైతుల్ని ఆదుకోవడంలో బీజేపీ విఫలమైందని కాంగ్రెస్‌ ఆరోపిస్తే... కాంగ్రెస్‌ వల్లే రైతులు ఈ స్థితిలో ఉన్నారంటూ బీజేపీ ఎదురు దాడి చేసింది.

Tags

Next Story